విధాత‌: చ‌లికాలంలో ద‌ట్టంగా పొగ‌మంచు కురుస్తుంద‌ని, డ్రైవ‌ర్లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌గా బ‌స్సులు న‌డ‌పాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ కోరారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకున్న చ‌రిత్ర, సుశిక్షుతులైన డ్రైవర్లు కలిగి ఉన్న సంస్థ మ‌న ఆర్టీసీదన్నారు. ఈ సందర్భంగా బ‌స్సు డ్రైవ‌ర్లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను తెలియ‌జేశారు. ఆర్టీసీ డ్రైవ‌ర్ల‌కు చేసిన సూచ‌న‌లు.. 1. హైవే, ఫారెస్ట్ రోడ్డు, నగర శివారు ప్రాంతాలలో వేగనియంత్రణ […]

విధాత‌: చ‌లికాలంలో ద‌ట్టంగా పొగ‌మంచు కురుస్తుంద‌ని, డ్రైవ‌ర్లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌గా బ‌స్సులు న‌డ‌పాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ కోరారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకున్న చ‌రిత్ర, సుశిక్షుతులైన డ్రైవర్లు కలిగి ఉన్న సంస్థ మ‌న ఆర్టీసీదన్నారు. ఈ సందర్భంగా బ‌స్సు డ్రైవ‌ర్లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను తెలియ‌జేశారు.

ఆర్టీసీ డ్రైవ‌ర్ల‌కు చేసిన సూచ‌న‌లు..

1. హైవే, ఫారెస్ట్ రోడ్డు, నగర శివారు ప్రాంతాలలో వేగనియంత్రణ పాటించాలి.
2. ప్రమాదకరమైన జంక్షన్, మలుపుల వద్ద ఇండికేటర్ ను త‌ప్ప‌నిస‌రిగా ఉపయోగించాలి.
3. ముందు వెళ్లే వాహనముతో సురక్షిత దూరాన్నిపాటించాలి.
4. హైవే మరియు అడవి రోడ్డు, దట్టమైన పొగమంచు ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేప్పుడు వైపర్ వాడాలి.
హెడ్లైట్‌ను lowbeamలో మరియు ఫాగ్ lights తప్పనిసరిగా వాడాలి. వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లాలి
5. పొగ మంచు ఉన్నచోట హారన్, లైట్లు వాడవలెను. దట్టమైన పొగమంచు ఉండి ముందు దారి కనపడని సమయంలో బస్సును రోడ్డు ప్రక్కన ఆపి హెడ్ లైట్స్ మరియు ఇండికేటర్ వేయవలెను.
6. Windscreen గ్లాసులను వైపర్ తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్ తో శుభ్రపరచవలెను.
7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ల‌తో ముఖం కాళ్లు చేతులు శుభ్రపరుచుకొనవలెను.
8. రోడ్డు మరమ్మతు ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించవలెను. అతి వేగంతో డ్రైవింగ్ చేయ‌వ‌ద్దు.
9. రోడ్డుపైన దట్టమైన పొగమంచు ఉన్న సమయంలో వాహనాన్ని ఓవర్ టేక్ చేయరాదు.
10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి.
11. హైవే రోడ్డులలో దట్టమైన పొగమంచు ఉన్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో wrong routeలో వెళ్లరాదు.
12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు.
13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు.
14. అతివేగంగా బస్సును నడపరాదు.
15.వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్‌గా ఇండికేటర్ వేయకూడదు.
16. డ్యూటీకి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకొనవలెను.
17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి.
18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడప‌కూడదు.
19. హైదరాబాద్ శివారుల్లో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి.
20. బస్సులో ఫుట్‌బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి.
21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కుతుంటారు. దీని వ‌ల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారి గమ్య స్థానంలోనే కండక్టర్, డ్రైవర్ గారు బ‌స్సు ఆపి బస్సులోకి చేర్చుకోవాలి.
22. చరవాణి మాట్లాడుతూ, మరియు ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు.

Updated On 3 Dec 2022 2:20 PM GMT
krs

krs

Next Story