Drunk Womens Hulchul | మొన్నటి వరకు యువకులే మద్యానికి అలవాటుపడగా.. ప్రస్తుతం మారుతూ వస్తున్న కల్చర్‌కు అనుగుణంగా యువతులు సైతం మద్యం తాగుతున్నారు. ఇక తాగిన మత్తులో ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామనే సోకి కూడా లేకుండాపోతున్నది. గతంలో యువతులు తాగి రోడ్లపై వీరంగం సృష్టించిన సంఘటనలు చూశాం.
తాజాగా తమిళనాడు చెన్నైలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్నది. తిరువల్లికేణి వాలాజా రోడ్డు వద్ద నిన్న రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో తాగి రోడ్డుపై బైఠాయించారు. స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూసి అవాక్కయ్యారు.
చెన్నై సిటీ బస్సు కింద ముగ్గురు మహిళలు పడుకున్నారు. ఆ తర్వాత పోలీసులు బస్సు కింద నుంచి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మద్యం మత్తులో అక్కడ ఉన్నది ఎవరు..? తాము ఏం చేస్తున్నామన్న స్పృహలో లేకుండా గొడవకు దిగారు. ముగ్గురు యువతులను ఓపికగా శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు యువతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆ తర్వాత వారిని విచారించగా.. ఆ ముగ్గురినిది కన్నగినగర్ ప్రాంతానికి చెందిన వారిగా తేలింది. తిరువల్లికేణి ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్ పని చేసేందుకు వచ్చారు. పని అయ్యాక మద్యం సేవించారు. ఆ తర్వాత మత్తులో రోడ్డుపైకి పరుగులు పెట్టారు. ముగ్గురిపై తిరువల్లికేణి పోలీస్ స్టేషన్ పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇండ్లకు పంపారు.