Viral Video | ప్ర‌పంచ వ్యాప్తంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతున్న‌ది. ఇటీవ‌లి కాలంలో ఈ -స్కూట‌ర్ల‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ-స్కూట‌ర్ల‌ను కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఈ-స్కూట‌ర్ల‌ను కొనే ముందు.. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల విష‌యంలో ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఎందుకంటే ఈ -స్కూట‌ర్ బ్యాట‌రీల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. ఈ-స్కూట‌ర్ బ్యాట‌రీలు ఎప్పుడంటే ఎప్పుడు పేలిపోతున్నాయి. తాజాగా లండ‌న్‌లోని ఓ ఇంట్లో పార్కు చేసి ఉంచిన ఈ-స్కూట‌ర్‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. […]

Viral Video | ప్ర‌పంచ వ్యాప్తంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతున్న‌ది. ఇటీవ‌లి కాలంలో ఈ -స్కూట‌ర్ల‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ-స్కూట‌ర్ల‌ను కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఈ-స్కూట‌ర్ల‌ను కొనే ముందు.. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల విష‌యంలో ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఎందుకంటే ఈ -స్కూట‌ర్ బ్యాట‌రీల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. ఈ-స్కూట‌ర్ బ్యాట‌రీలు ఎప్పుడంటే ఎప్పుడు పేలిపోతున్నాయి.

తాజాగా లండ‌న్‌లోని ఓ ఇంట్లో పార్కు చేసి ఉంచిన ఈ-స్కూట‌ర్‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. ఈ-స్కూట‌ర్ ఛార్జింగ్ అవుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయాలు కాలేదు. బ్యాట‌రీ పేలిపోవ‌డంతో య‌జ‌మాని తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాడు. ఈ స్కూట‌ర్‌ను రెండు వారాల క్రిత‌మే కొనుగోలు చేసిన‌ట్లు య‌జ‌మాని పేర్కొన్నాడు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను లండ‌న్ ఫైర్ బ్రిగేడ్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ఈ ఏడాది లండ‌న్‌లో 48 ఈ-బైక్‌లు, 12 ఈ-స్కూట‌ర్లు పేలిపోయిన‌ట్లు తెలిపింది.

Updated On 20 May 2023 2:23 AM GMT
subbareddy

subbareddy

Next Story