విధాత‌: వెచ్చని కాఫీలు, సూపులు, క్రిస్పీ చిప్స్, వేడివేడి స్నాక్స్ తింటూ తాగుతూ బద్దకంగా గడపాలని పించే కాలం. కానీ ఇలా గడిపితే వాత పిత్త కఫ దోషాలు ప్రకోపించవచ్చని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలం ప్రారంభం నుంచి చివరి వరకు వాత, కఫాలను సమతులంగా ఉంచడం అవసరం. ఇవి సమతులంగా ఉంటే కీళ్ల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, చర్మంలో నునుపుదనం నిలిచి ఉంటుంది. కఫ దోషం ఏర్పడితే శ్లేష్మ సంబంధ అనారోగ్యాలు, బరువు పెరగడం, […]

విధాత‌: వెచ్చని కాఫీలు, సూపులు, క్రిస్పీ చిప్స్, వేడివేడి స్నాక్స్ తింటూ తాగుతూ బద్దకంగా గడపాలని పించే కాలం. కానీ ఇలా గడిపితే వాత పిత్త కఫ దోషాలు ప్రకోపించవచ్చని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలం ప్రారంభం నుంచి చివరి వరకు వాత, కఫాలను సమతులంగా ఉంచడం అవసరం. ఇవి సమతులంగా ఉంటే కీళ్ల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, చర్మంలో నునుపుదనం నిలిచి ఉంటుంది.

కఫ దోషం ఏర్పడితే శ్లేష్మ సంబంధ అనారోగ్యాలు, బరువు పెరగడం, నీరసం ఇతర మానసిక సమస్యలకు కారణం అవుతుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలు భోజనంలో భాగం చేసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిదో నిపుణులు చెప్పిన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆరోగ్యాన్నిచ్చేది ఆహారమే. చలికాలం ఇమ్యూనిటీ తగ్గే కాలం కనుక తప్పనిసరిగా బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం అవసరం. శరీరంలో దోషాలు ఏర్పడకుండా నివారించేందుకు ఆహారంలో మార్పు తప్పదు.

శీతాకాలం ఆహారంలో గుడ్డు, నెయ్యితో చేసిన కిచిడి, వెచ్చని పాలు, నువ్వులు, చెరకుతో చేసిన పదార్థ్థాలు, బాదం, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్, మాంసాహారులైతే చికెన్ సూప్, నెయ్యితో వండిన ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలి.

తులసి, లెమన్ గ్రాస్, అల్లం కలిపి చేసిన హెర్బల్ గ్రీన్ టీ తరచుగా తీసుకోవాలి. ఇవ్వన్నీ కూడా చలికాలంలో బలంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. వీటిలోని బెల్లం శరీరంలో వేడి పెంచుతుంది. జీర్ణ క్రియ సజావుగా సాగడానికి అవసరమైన ఎంజైముల ఉత్పత్తికి, ఇమ్యూనిటీ పెంచేందుకు బెల్లం మంచి పదార్థం.

కిచిడి పూర్వం నుంచి మనకు తెలిసిన వంటల్లో ఒకటి. బియ్యం, గింజధాన్యాలు, కూరగాయలు కలిపి వండిన ఈ పదార్థం ఆవునేతితో చేసుకుంటే ఒక సూపర్ ఫూడ్ గా తయారవుతుంది. ఇది తరచుగా తింటే శరీరానికి తగినన్ని అమైనోఆసిడ్స్ ను అందిస్తుంది. అంతేకాదు ఇందులో ప్రొటీన్లు కూడా పుష్కలం.

నువ్వులు శరీరంలో వేడి పెంచే మంచి కొవ్వులు కలిగిన గింజలు. వీటిలో ఐరన్, కాపర్, జింక్ రకరకాల విటమిన్లతో బలవర్థకమైన‌వి నూనె గింజలు. ఆకుకూరలు లభించే కాలం ఇది. వీలైనన్ని ఎక్కువ రకాల ఆకుకూరలు తీసుకోగలిగితే ఎంతో మేలు. బచ్చలి, పాలకూర, మెంతి కూర, ఉల్లి ఆకు, వంటి ఆకుకూరలు ఏదో ఒక రకంగా వాడాలి. ఇవి ఇమ్యూనిటితో పాటు శరీరానికి వేడిమిని కూడా అందిస్తాయి.

పసుపు కలిపిన పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. చలికాలంలో నిద్రకు ముందు తప్పనిసరిగా చిటికెడు పసుపు కలిపిన కప్పు పాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. కీళ్లు గట్టిపడడం మాత్రమే కాదు, చలికాలంలో తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు దరి చేరచుండా నివారిస్తాయి.

చికెన్ సూప్ తీసుకోవడం కూడా చాలా మంచిది. దీని తయారిలో వాడే మసాలాలు శరీరంలో వేడి పుట్టిస్తాయి. చలికాలంలో వేడిగా టీ, కాఫీలు తాగడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ వీటి బదులుగా తులసి, అల్లం, లెమన్ గ్రాస్‌తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. ఈ పానీయం వెచ్చగా సౌకర్యంగా ఉండడం మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది.

Updated On 31 May 2023 1:17 AM GMT
krs

krs

Next Story