Eatela Jamuna కేసీఆర్ పై పోటీకి బీజేపీ వ్యూహం విధాత: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ముమ్మరం చేసింది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే మొదటి జాబితా వెల్లడించింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కమల దళం గురి పెట్టింది. పార్టీ టికెట్ల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలకు […]

Eatela Jamuna
- కేసీఆర్ పై పోటీకి బీజేపీ వ్యూహం
విధాత: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ముమ్మరం చేసింది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే మొదటి జాబితా వెల్లడించింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కమల దళం గురి పెట్టింది. పార్టీ టికెట్ల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలకు మొత్తం 6003 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇందులో సీఎం కేసీఆర్ ఇదివరకే తాను ప్రకటించి పోటీచేసే గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి కీలకమైంది. ధీటుగా ఎదుర్కొని, విజయం దిశగా సాగే బలమైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై గురి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ ప్రధాన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ముదిరాజ్ సమాజంలో బలమైన నేతగా పేరుంది. ఆయన సతీమణి ఈటల జమున… సీఎం కేసీఆర్ పై పోటీకి సై అంటున్నట్లు తెలుస్తోంది. ఆమె గజ్వేల్ స్థానంలో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు
ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ అధిష్టానానికి దరఖాస్తు కూడా సమర్పించడంతో కేసీఆర్ పై పోటీకి తెరపైకి వచ్చారు. బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందా? నిరాకరిస్తుందా? గజ్వేల్ బరిలో నిలవనున్నారా? అన్నది ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. మరోవైపు హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దంపతులిద్దరూ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటేందుకు ఉవిళ్లూరుతున్నారు
