కాంగ్రెస్‌ను దెబ్బ‌ తీయ‌డానికి తెలంగాణ‌లో బెంగాల్ త‌ర‌హా ప్ర‌యోగం టీఆర్ ఎస్‌, బీజేపీల‌ వార్ ఒక వీధి నాటకం మీడియాతో టీపీసీసీ రేవంత్ రెడ్డి విధాత‌: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయ‌డానికి టీఆర్ఎస్‌,బీజేపీలు కుమ్మ‌క్కై రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేర‌కు త‌మ పార్టీని దెబ్బ‌ తీయ‌డానికే బెంగాల్ త‌ర‌హా ప్ర‌యోగం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌న్నారు. ఈ […]

  • కాంగ్రెస్‌ను దెబ్బ‌ తీయ‌డానికి తెలంగాణ‌లో బెంగాల్ త‌ర‌హా ప్ర‌యోగం
  • టీఆర్ ఎస్‌, బీజేపీల‌ వార్ ఒక వీధి నాటకం
  • మీడియాతో టీపీసీసీ రేవంత్ రెడ్డి

విధాత‌: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయ‌డానికి టీఆర్ఎస్‌,బీజేపీలు కుమ్మ‌క్కై రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేర‌కు త‌మ పార్టీని దెబ్బ‌ తీయ‌డానికే బెంగాల్ త‌ర‌హా ప్ర‌యోగం చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌న్నారు. ఈ రెండు పార్టీల మ‌ధ్య జ‌రిగే వార్ ఒక వీధి నాట‌కాన్నిత‌ల‌పిస్తుంద‌ని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల వీధి నాట‌కాల‌ను తెలంగాణ స‌మాజం గ‌మ‌నిస్తోంద‌న్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవితను మాత్రం అనుమతి కోరుతున్నారన్నారు. దీనిని బ‌ట్టి ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోందన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే.. కేంద్రంలోనీ బీజేపీ ప్ర‌భుత్వం కోకాపేట భూములు, బంగారు కూలీ, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.

గతంలో తాను చేసిన ఫిర్యాదుల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎందుకు స్పందన లేదని రేవంత్ ప్ర‌శ్నించారు. తాను ఢిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే, క‌నీసం క‌ల‌వ‌డానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడినైనా తాను ఒక ఎంపీగా అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వ‌లేద‌ని, మ‌రి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎవ‌రిని క‌లుస్తుంది? ఎవ‌రి కోసం ప‌ని చేస్తుంద‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. డిసెంబర్ 6 లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా పోతుందన్నారు.

Updated On 3 Dec 2022 11:49 AM GMT
krs

krs

Next Story