EC | జూలై 31 గడువు పెట్టిన ఈసీ విధాత: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ ప్రారంభించింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలలో జూలై 31వ తేదీలోగా అధికారుల బదిలీలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న అధికారుల బదిలీలు పూర్తి చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు […]

EC |
జూలై 31 గడువు పెట్టిన ఈసీ
విధాత: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ ప్రారంభించింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలలో జూలై 31వ తేదీలోగా అధికారుల బదిలీలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న అధికారుల బదిలీలు పూర్తి చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆయా రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లకు వాళ్ల సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వొద్దని, అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని పేర్కొంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది.
