Delhi Liquor Scam | ఢిల్లీతో పాటు తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) దూకుడు పెంచింది. ఈ కేసులో మ‌రో ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తుల‌ను ఈడీ అరెస్టు చేసింది. పెన్నాక శ‌ర‌త్ చంద్రారెడ్డి, విన‌య్ బాబు అనే వ్య‌క్తుల‌కు రూ. కోట్ల మ‌ద్యం వ్యాపారం ఉంద‌ని ఈడీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించిన‌ట్లు శ‌ర‌త్‌పై అభియోగాలు ఉన్న‌ట్లు తెలిపారు. అర‌బిందో గ్రూపులోని 12 కంపెనీల‌కు, […]

Delhi Liquor Scam | ఢిల్లీతో పాటు తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) దూకుడు పెంచింది. ఈ కేసులో మ‌రో ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తుల‌ను ఈడీ అరెస్టు చేసింది. పెన్నాక శ‌ర‌త్ చంద్రారెడ్డి, విన‌య్ బాబు అనే వ్య‌క్తుల‌కు రూ. కోట్ల మ‌ద్యం వ్యాపారం ఉంద‌ని ఈడీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించిన‌ట్లు శ‌ర‌త్‌పై అభియోగాలు ఉన్న‌ట్లు తెలిపారు. అర‌బిందో గ్రూపులోని 12 కంపెనీల‌కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థ‌లోనూ శ‌ర‌త్ చంద్రారెడ్డి డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. అయితే ఈ లిక్క‌ర్ స్కాంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను గ‌తంలో సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఈ వ్య‌వ‌హారంలో మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది.

ఈ వ్య‌వ‌హారంలో సెప్టెంబ‌ర్ 21 నుంచి 23వ తేదీ వ‌ర‌కు శ‌ర‌త్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శ‌ర‌త్‌ను ఢిల్లీలో ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో హైద‌రాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూష‌న్ ఎల్ఎల్‌పీ డైరెక్ట‌ర్ బోయిన్‌ప‌ల్లి అశోక్‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

Updated On 10 Nov 2022 5:23 AM GMT
subbareddy

subbareddy

Next Story