విధాత: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీకేజీ కేసులో విచారణకు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ శుక్రవారం కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
నిందితులు రేణుక, రాజేశ్వర్ నాయక్, డాక్య నాయక్, గోపాల్ నాయక్, నీలేష్ లను కస్టడీకి ఇవ్వాలని కోరింది. కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
నిందితుల తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. నిందితుల్లో ఒకరైన రేణుక ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.