12న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశం Nusrat Jahan | విధాత‌: ఫ్లాట్ల అమ్మకాల కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సినీ న‌టి నుస్రత్ జహాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​జారీ చేసింది. మంగ‌ళ‌వారం ఈ విష‌యాన్ని ఈడీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కోల్‌క‌త్తా నగరంలోని తూర్పు ప్రాంతాల్లో కొత్త‌గా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రాల్లో ప్లాట్లు ఇప్పిస్తాన‌ని సీనియర్‌ సిటిజన్ల‌ను మోగించిన కేసులో ఈడీ ఆమెను విచారించ‌నున్న‌ది. ఈ కేసులో విచార‌ణ కోసం ఈ నెల […]

  • 12న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశం

Nusrat Jahan | విధాత‌: ఫ్లాట్ల అమ్మకాల కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సినీ న‌టి నుస్రత్ జహాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​జారీ చేసింది. మంగ‌ళ‌వారం ఈ విష‌యాన్ని ఈడీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కోల్‌క‌త్తా నగరంలోని తూర్పు ప్రాంతాల్లో కొత్త‌గా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రాల్లో ప్లాట్లు ఇప్పిస్తాన‌ని సీనియర్‌ సిటిజన్ల‌ను మోగించిన కేసులో ఈడీ ఆమెను విచారించ‌నున్న‌ది.

ఈ కేసులో విచార‌ణ కోసం ఈ నెల 12న స్వ‌యంగా కోల్‌కతాలోని త‌మ కార్యాల‌యానికి విచారణకు హాజ‌రు కావాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. విచార‌ణ సంద‌ర్భంగా ఏజెన్సీ ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తుందని భావిస్తున్నారు. న్యూ టౌన్ ప్రాంతంలో ఫ్లాట్‌లు ఇప్పిస్తానని రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందని ఆరోపిస్తూ సీనియర్ సిటిజన్ల‌ బృందం ఇటీవల ఫిర్యాదు చేయడంపై ఈడీ విచార‌ణ జరుపుతున్న‌ది.

Updated On 5 Sep 2023 11:49 AM GMT
somu

somu

Next Story