Egypt | ఒక‌ప్పుడు విదేశీ ప‌ర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన‌ ఈజిప్ట్.. కొవిడ్ అనంత‌రం ఆ రంగంలో వెన‌క‌బ‌డింది. దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు త‌మ‌కే ప్ర‌త్యేక‌మైన మమ్మీల‌ను ఉప‌యోగించుకోనుంది. రాజ‌ధాని కైరోకు 30 కి.మీ. దూరంలో ఉన్న స‌ఖారా న‌గ‌రంతో పాటు ఇత‌ర ప్రాచీన న‌గ‌రాల్లో ఈజిప్ట్ ప్ర‌భుత్వం విరివిగా త‌వ్వ‌కాలు జ‌రిపిస్తోంది. దీని ఫ‌లితంగా స‌మీప గతంలో ఎప్పుడూ లేన‌ని మ‌మ్మీలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇలా దొరికిన మ‌మ్మీలతో ప్ర‌పంచ ప్ర‌సిద్ధ గాజా పిర‌మిడ్ స‌మీపంలో ఒక భారీ […]

Egypt |

ఒక‌ప్పుడు విదేశీ ప‌ర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన‌ ఈజిప్ట్.. కొవిడ్ అనంత‌రం ఆ రంగంలో వెన‌క‌బ‌డింది. దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు త‌మ‌కే ప్ర‌త్యేక‌మైన మమ్మీల‌ను ఉప‌యోగించుకోనుంది. రాజ‌ధాని కైరోకు 30 కి.మీ. దూరంలో ఉన్న స‌ఖారా న‌గ‌రంతో పాటు ఇత‌ర ప్రాచీన న‌గ‌రాల్లో ఈజిప్ట్ ప్ర‌భుత్వం విరివిగా త‌వ్వ‌కాలు జ‌రిపిస్తోంది. దీని ఫ‌లితంగా స‌మీప గతంలో ఎప్పుడూ లేన‌ని మ‌మ్మీలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ఇలా దొరికిన మ‌మ్మీలతో ప్ర‌పంచ ప్ర‌సిద్ధ గాజా పిర‌మిడ్ స‌మీపంలో ఒక భారీ ప్ర‌పంచ‌స్థాయి మ్యూజియంను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దేశ ప్ర‌జ‌ల ప్ర‌ధాన ఆహార‌మైన గోధుమ‌కు సంబంధించి 80 శాతంపైగా అవ‌స‌రాల‌కు ఉక్రెయిన్ దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డిన ఈ దేశం.. ర‌ష్యా ఉక్రెయిన్ సంక్షోభం కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతోంది.

తాజాగా ఇక్క‌డి స‌ఖారా న‌గ‌రంలో రెండు మ‌మ్మీల‌తో పాటు రెండు స‌మాధుల‌ను వెలికితీశామ‌ని ఈజిప్ట్ పురాత‌న వ‌స్తువుల అత్యున్న‌త మండ‌లి అధికారి మొస్త‌ఫా వాజిరి వెల్ల‌డించారు. ఈ మ‌మ్మీలు 380 - 343 బీసీ కాలానికి, 305-30 బీసీ కాలానికి చెందిన‌వ‌ని తెలిపారు. న‌గ‌రంలోని బాస్టెట్ దేవ‌త గుడి వ‌ద్ద సంవత్స‌రం పాటు త‌వ్వ‌కాలు చేసి వీటిని క‌నుగొన్నామ‌న్నారు.

2019లో ఇక్క‌డే వంద‌ల కొద్దీ జంతువుల మ‌మ్మీలు దొర‌క‌డం విశేషం. 'పూత పూసిన రెండు మ‌మ్మీల‌ను క‌నుగొన్నాం. వాటిలో ఒక‌టి మ‌నిషిది కాగా మ‌రొక‌టి జంతువుది. వాటితో పాటే పూడ్చిపెట్టిన చోట.. పేర్చిన రాళ్ల దొంత‌ర‌, మ‌ట్టి కుండ‌లు, పాత్ర‌లు, ఉప్పు, గుడ్డ పీలిక‌లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వ‌ర‌సగా 4400, 3400 వ‌య‌సున్న ఇద్ద‌రు పూజారుల శ‌వ‌పేటిక‌లూ ల‌భించాయి' అని వాజిరి తెలిపారు.

ఒకప్పుడు మమ్మీల వల్లే బతికి..

ఈజిప్ట్‌లో కొన్ని నెల‌ల నుంచి మాంద్యం వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ త‌ర్వాత ఇప్పుడిప్పుడే ప‌ర్యాట‌కుల సంఖ్య పెర‌గ‌డంతో ప‌రిస్థితి కుదుట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒకానొక స‌మ‌యంలో మ‌మ్మీల అధికార,అన‌ధికార విక్ర‌యాల ద్వారా ఈ దేశ ప్ర‌భుత్వం, వ్యాపారులు విప‌రీత లాభాల‌ను ఆర్జించే వారు.

కాలం మార‌డంతో మ‌మ్మీల‌పై చాలా మందికి ఆస‌క్తి స‌న్న‌గిల్లింది. దీంతో మ‌మ్మీల ప‌ర్యాట‌కం, అమ్మ‌కాల‌పైనే ఆధార‌ప‌డిన ఈజిప్ట్ ఆర్థిక ప‌రిస్థితి క్షీణించ‌డం మొద‌లుపెట్టింది. ఈ ప‌రిస్థితిని మార్చాల‌ని ఇప్పుడు కొత్త మ‌మ్మీల వెలికితీత‌ను ప్ర‌భుత్వం ప్రోత్సహిస్తోంది.

Updated On 29 May 2023 9:24 AM GMT
krs

krs

Next Story