ఈ ఏడాదంతా ఎన్నికల సందడి విధాత: దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూళ్లను ప్రకటించటానికి సన్నద్ధమవుతుండగా, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ మధ్యాహ్నమే కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్య్రాల ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఫిబ్రవరి 16న త్రిపుర, 27న మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించబడుతాయని, మార్చి 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. త్రిపుర, […]

ఈ ఏడాదంతా ఎన్నికల సందడి

విధాత: దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూళ్లను ప్రకటించటానికి సన్నద్ధమవుతుండగా, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటం గమనార్హం.

ఈ మధ్యాహ్నమే కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్య్రాల ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఫిబ్రవరి 16న త్రిపుర, 27న మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించబడుతాయని, మార్చి 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

త్రిపుర, మేఘాలయ, నాగాలండ్‌ ఈశాన్య రాష్ట్రాలకు వచ్చే నెల మార్చితో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పోలీస్‌, ఇతర ఉన్నతా ధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించి వచ్చారు. ఎన్నిలక నిర్వహణకు శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మొత్తంగా సామాజిక, రాజకీయ పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతనే ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలండ్‌ల్లో బీజేపీ ప్రత్యక్ష, పరోక్ష అధికారం కలిగి ఉన్నది. త్రిపురలో నేరుగా బీజేపీ అధికారం చెలాయిస్తుండగా, మేఘాలయ, నాగాలండ్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతున్నది. వీటిలో తిరిగి ఒంటరిగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే బలాన్ని సంతరించుకొని అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నది.

ఇదిలా ఉంటే… కేంద్రంలోని బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ నేడు ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించి యావత్‌ దేశదృష్టిని తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సభకు పంజాబ్‌, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు హాజరవుతుండటం గమనార్హం.

ఈ ఏడాది చివరలో కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువు ముగియనున్నది. ఈ రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ సభ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సభను లక్షలాది మందితో నిర్వహించి దేశానికి మోదీకి ప్రత్యామ్నంగా కేసీఆర్‌ తానున్నానని చాటడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాదంతా.. ఎన్నికల హడావుడి ఉంటుందనటంలో సందేహం లేదు.

Updated On 18 Jan 2023 11:27 AM GMT
krs

krs

Next Story