విధాత: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఆ పార్టీ ఇప్పటివరకు గెలువని 160 స్థానాలపై దృష్టి సారించిందని వార్తలు వస్తున్నాయి. అయితే 2024లో ఎన్నికలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజాగా ఇదే విషయంపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. వచ్చే ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని భావించడం పొరపాటని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయ పడ్డారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉన్నదన్నారు.
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అమర్త్యసేన్ తన అబిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు పాత్ర కీలకమని, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ కీలక వ్యవహరిస్తాయని తాను బావిస్తున్నట్టు చెప్పారు. ఎస్పీ కూడా ఉంటుందని, కానీ అది ఎంతవరకు అన్నది చూడాలన్నారు.
బీజేపీకి ఎదురు నిలిచే పార్టీ లేదని ఆలోచన కలిగి ఉండటం తప్పనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే కాంగ్రెస్, ఎన్పీపీ, జేడీయూ కొత్త పొత్తులకు సిద్దమవుతున్నాయి. ఈ సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోతే మంచిది కాదన్నారు. అయితే ఆ పార్టీకి బలంతో పాటు బలహీనతలూ ఉన్నాయి. మిగతా పార్టీలు గట్టిగా యత్నిస్తే .. దానికి గట్టి పోటీ ఇవ్వొచ్చని అని ఆయన అబిప్రాయపడ్డారు.