Tuesday, January 31, 2023
More
    Homelatestకరెంటు ‘అదనపు డిపాజిట్’ ఛార్జిల మోత.. గ్రామాల్లో షురువైన నిరసనలు!

    కరెంటు ‘అదనపు డిపాజిట్’ ఛార్జిల మోత.. గ్రామాల్లో షురువైన నిరసనలు!

    • వేల‌ల్లో బిల్లులు
    • బిల్లులు క‌ట్ట‌కుండా అడ్డ‌కుంటున్న వైనం
    • విద్యుత్ అధికారుల నిల‌దీత‌

    విధాత, నిజామాబాద్: అదనపు కన్స్యూమర్ డిపాజిట్(ACD) పేర విద్యుత్ బిల్లులు మోత మోగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఏడాదిలో వినియోగించిన విద్యుత్ యూనిట్లను 12 నెలలకు సరాసరి వచ్చిన దానికి రెండు నెలల మొత్తాన్ని డిపాజిట్ గా బిల్లులో చేర్చుతున్నారు. దీంతో వేల రూపాయల బిల్లు చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

    ఎలక్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నిర్ణయించిన మేరకు దీన్ని అదనపు డిపాజిట్ గా పేర్కొంటూ ట్రాన్స్‌కో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ బిల్లు వివరాలు తెలియకుండానే కొంతమంది అడిగినంత చెల్లించారు. కొన్ని గ్రామాల్లో దీన్ని అర్థం చేసుకొని ట్రాన్స్‌కో అధికారులను నిలదీస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో అదనపు డిపాజిట్ పై ఎక్కడికక్కడ అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగుతున్నారు.

    కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం గ్రామస్తులు ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు. మొన్న రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో సిబ్బందిని గ్రామస్థులు బిల్లులు వసూల్ చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడిప్పుడే దీనిపై మిగతా గ్రామాల్లో అవగాహనకు వస్తున్నారు. వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాన్స్‌కో ఎస్ఇ రమేష్ బాబు సైతం కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.

    ఈ కారణంగా ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది వెళ్లి అదనపు డిపాజిట్ పై వివరించడం వల్ల ఇప్పటి వరకు దీని గురించి తెలియని వారికి తెలిసి పోతుంది. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అదనపు డిపాజిట్ పేర వేలాది రూపాయల బిల్లులను వడ్డించడంపై జనం ఆగ్రహంగా ఉన్నారు. వంద రూపాయలకు పైగా వున్న బిల్లుకు వేల రూపాయల్లో బిల్లు రావడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.

    విద్యుత్ కనెక్షన్ తీసుకున్నప్పటి కంటే విద్యుత్ వినియోగం లోడ్ పెరిగిన వారికి అదనపు డిపాజిట్ రూపంలో ఏసిడి ఛార్జిలుగా పేర్కొనడం వల్ల వేలాది రూపాయలతో బిల్లులు వస్తున్నాయి. వంద రెండు వందల మధ్య ఉండాల్సిన బిల్లు వేళల్లో రావడం పట్ల వస్తున్న వ్యతిరేకతపై ట్రాన్స్‌కో తగ్గడం లేదు. దీంతో ఒక్కో గ్రామంలో నిరసనలు, నిలదీత, వాగ్వాదంతో ట్రాన్స్‌కో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

    కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం గృహ వినియోగానికి సంబంధించి 2 లక్షల 60 వేల 600 కనెక్షన్లు వుండగా వాణిజ్య కనెక్షన్లు 30 వేల 500, వీధి దీపాలు, వాటర్ వర్క్స్ 6 వేల 534, పరిశ్రమలు 2 వేల 568 కనెక్షన్లు ఉన్నాయి.  అదనపు డిపాజిట్ వల్ల అద్దె ఇళ్లు, భవనాల్లో ఉంటున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. విద్యుత్ బిల్లులను పిరమిడ్ విధానంలో వేస్తున్నందున మళ్ళీ అదనపు డిపాజిట్ వసూల్ చేయడం ఏమిటని వినియోదరులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో వినియోగదారుడికి వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు బిల్లులు వచ్చాయి.

    కనెక్షన్ ఏదైనా వినియోగం పెరిగి లోడ్ ఎక్కువైతే అదనపు డిపాజిట్ ను బిల్లులో వేసి వసూల్ చేయడం పట్ల వినియోగదారుల్లో అవగాహన పెరిగిన కొద్దీ గ్రామాలవారీగా ఆందోళనలు అధిక‌మ‌వుతున్నాయి. కాగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అదనపు డిపాజిట్ తో కలిపి బిల్లులు వేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఇ రమేష్ బాబు తెలిపారు.

    వినియోగం లోడ్ సామర్థ్యం ఆధారంగా అదనపు డిపాజిట్ ను వసూల్ చేస్తున్నట్లు చెప్పారు. బిల్లులు చెల్లించడానికి 30 రోజుల గడువు ఇస్తున్నామని, ఇది రెండు నెలల అడ్వాన్స్ గా సంస్థ వద్ద ఉంటుందన్నారు. ఇదే విషయమై తమ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు అవ‌గాహ‌న కల్పిస్తున్నట్లు చెప్పారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular