Friday, October 7, 2022
More
  Home latest అర‌టి పండు ఇవ్వ‌లేద‌ని మావ‌టిని చంపిన ఏనుగు

  అర‌టి పండు ఇవ్వ‌లేద‌ని మావ‌టిని చంపిన ఏనుగు

  విధాత: ఓ గ‌జ రాజు త‌న మావ‌టిపై గ‌ర్జించింది. స‌మ‌యానికి అర‌టి పండు ఇవ్వ‌లేద‌నే కోపంతో మావ‌టిపై ఆ ఏనుగు విరుచుకుప‌డింది. తొండెంతో ఆ వ్య‌క్తిని పైకి లేపి నేల‌కేసి బాదింది. దీంతో తీవ్ర గాయాల‌పాలైన మావ‌టి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సియోనిలో వెలుగు చూసింది.

  వివ‌రాల్లోకి వెళ్తే.. భ‌ర‌త్ వాసుదేవ్(56), గోవింద్ గిరి అనే వ్య‌క్తులిద్ద‌రూ ఓ ఏనుగుతో గ్రామాల్లో తిరుగుతూ, ప్ర‌జ‌ల‌కు వినోదం క‌ల్పించేవారు. ఏనుగుపై పిల్ల‌ల‌ను ఎక్కించి స‌ర‌దాగా తిప్పుతూ డ‌బ్బులు సంపాదించేవారు. అయితే బండోల్ గ్రామ స‌మీపంలో విశ్రాంతి కోసం వాసుదేవ్, గిరి ఆగారు.

  అటుగా వెళ్తున్న ఓ ట్ర‌క్కు డ్రైవ‌ర్ ఏనుగును గ‌మ‌నించి, అర‌టి పండ్ల గుత్తిని వాసుదేవ్‌కు ఇచ్చాడు. ఆ అర‌టి పండ్ల‌ను ఏనుగుకు ఇవ్వ‌కుండా త‌న బ్యాగులో దాచి పెట్టుకున్నాడు. కొంత స‌మ‌యం వ‌ర‌కు ఏనుగు వేచి చూసింది. అయినా అర‌టి పండ్ల‌ను ఏనుగుకు ఇవ్వ‌లేదు.

  దీంతో కోపంతో ఊగిపోయిన ఏనుగు.. వాసుదేవ్‌ను త‌న తొండెంతో పైకి లేపి బ‌లంగా కింద ప‌డేసింది. వాసుదేవ్ స్పృహ కోల్పోవ‌డంతో.. గిరి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు, వాసుదేవ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తుండ‌గా ప్రాణాలు కోల్పోయాడు.

  ఏనుగును ప‌రీక్షించిన వెట‌ర్న‌రీ వైద్యులు

  వాసుదేవ్‌ను చంపేసిన ఏనుగును వెట‌ర్న‌రీ వైద్యులు ప‌రీక్షించారు. ఏనుగు మాన‌సికంగా బాగానే ఉంద‌ని నిర్ధారించారు. అయితే ఏనుగును గిరికి అప్ప‌గించాలా? లేదా పెంచ్ నేష‌న‌ల్ పార్క్‌కు త‌ర‌లించాలా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page