Elephant | విధాత: ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక అడవి ఏనుగు బీభత్స సృష్టించింది. పార్వతీపురం - రాయగడ రహదారిలో అర్తామ్ గ్రామంలో రోడ్డుమీద నిలబడి జనాన్ని భయకంపితులను చేసింది. వచ్చిపోయే వాహనాలను ఆపేయడమే కాకుండా ఒక బస్సు అద్దాలను పగులగొట్టింది. వాస్తవానికి హరి అనే పేరుగల ఈ ఏనుగు రౌడీ ఏనుగు అని చెప్పవచ్చు. ఎనిమిది ఏనుగుల గుంపులో ఇదే కాస్త అల్లరి.. రౌడీలా ప్రవర్తిస్తుంది. ఇప్పటికే ముగ్గురు ప్రజలను తొక్కి చంపేసిన […]

Elephant |
విధాత: ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక అడవి ఏనుగు బీభత్స సృష్టించింది. పార్వతీపురం - రాయగడ రహదారిలో అర్తామ్ గ్రామంలో రోడ్డుమీద నిలబడి జనాన్ని భయకంపితులను చేసింది. వచ్చిపోయే వాహనాలను ఆపేయడమే కాకుండా ఒక బస్సు అద్దాలను పగులగొట్టింది.
వాస్తవానికి హరి అనే పేరుగల ఈ ఏనుగు రౌడీ ఏనుగు అని చెప్పవచ్చు. ఎనిమిది ఏనుగుల గుంపులో ఇదే కాస్త అల్లరి.. రౌడీలా ప్రవర్తిస్తుంది. ఇప్పటికే ముగ్గురు ప్రజలను తొక్కి చంపేసిన ఈ కరిరాజు తనకు అడ్డం వస్తే ఎవరిమీదైనా.. ఎంత పెద్ద వాహనం మీదైనా ఎటాక్ చేస్తుంది.
దీనికి పార్వతీపురం అటవీ అధికారులు హరి అని పేరు పెట్టారు.. ఒరిస్సా నుంచి ఇటు వచ్చిన ఈ ఏనుగుల గుంపు తరచూ గ్రామాల మీదపడి బీభత్సం సృష్టిస్తుంటాయి. అరటి తోటలు.. కూరగాయల పంటల మీద పడి తినేయడమే కాకుండా రైతులమీద కూడా దాడి చేయడం కింద పడేసి తొక్కి చంపేయడం చేస్తున్నాయి. వీటిని ఒరిస్సా అడవుల్లోకి పంపేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
Elephant smashes bus windshield in Parvathipuram manyam, wreaks havoc on highway#AndhraPradesh pic.twitter.com/H0EYITejzn
— Indian News Network (@INNChannelNews) September 4, 2023
