Viral Video | ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీగా ఉన్నప్పుడు సామాన్యులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాలను కూడా పక్కకు తీసేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తారు పోలీసులు. ఆ మాదిరిగానే ఓ ఏనుగు కూడా ట్రాఫిక్ పోలీసులు చేసిన పనే చేసింది. రోడ్డుపై నిలిపి ఉంచిన బైక్‌ను తన తొండెంతో తోసేంది. దీంతో ఆ బైక్ ఫుట్‌పాత్‌పై వచ్చి పడింది. ఫుట్‌పాత్‌పై ఉన్న వాహనాలను ఆ ఏనుగు టచ్ […]

Viral Video | ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీగా ఉన్నప్పుడు సామాన్యులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాలను కూడా పక్కకు తీసేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తారు పోలీసులు.
ఆ మాదిరిగానే ఓ ఏనుగు కూడా ట్రాఫిక్ పోలీసులు చేసిన పనే చేసింది. రోడ్డుపై నిలిపి ఉంచిన బైక్‌ను తన తొండెంతో తోసేంది. దీంతో ఆ బైక్ ఫుట్‌పాత్‌పై వచ్చి పడింది. ఫుట్‌పాత్‌పై ఉన్న వాహనాలను ఆ ఏనుగు టచ్ కూడా చేయలేదు. ఈ సమయంలో ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తులు భయంతో పరుగెత్తారు.
బైక్‌ను.. ఎత్తి పడేసిన ఏనుగు pic.twitter.com/TyXQPLNFJp
— vidhaathanews (@vidhaathanews) January 5, 2023
ఈ వీడియోను బెంగళూరు ఈస్ట్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వాహనాలను మెయిన్ రోడ్డు మీద పార్కింగ్ చేయొద్దని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఏనుగు చాలా కోపంతో.. ఆ వాహనాన్ని తోసేసింది. ఏనుగు చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికైనా వాహనదారులు బుద్ధి తెచ్చుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.
