Elon Musk | శత కోటీశ్వరుడు ఎలాన్ మస్క్‌తో అఫైర్ ఉందన్న ఆరోపణ మధ్య గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ తన భార్య నికోల్ షనాహన్‌కు విడాకులు ఇచ్చాడు. అయితే.. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని మస్క్, నికోల్ ఇప్పటికే ఖండించారు. తన విడాకుల విషయాన్ని సెర్గీ బ్రిన్ రహస్యంగా ఉంచినట్టు చెబుతున్నారు. అయితే.. విడాకుల పత్రాలుగా చెబుతున్న డాక్యుమెంట్లను పేజీ సిక్స్ బయటపెట్టింది. వీటి ప్రకారం.. వీరిద్దరి మధ్య విడాకుల డీల్ మే […]

Elon Musk |
శత కోటీశ్వరుడు ఎలాన్ మస్క్‌తో అఫైర్ ఉందన్న ఆరోపణ మధ్య గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ తన భార్య నికోల్ షనాహన్‌కు విడాకులు ఇచ్చాడు. అయితే.. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని మస్క్, నికోల్ ఇప్పటికే ఖండించారు. తన విడాకుల విషయాన్ని సెర్గీ బ్రిన్ రహస్యంగా ఉంచినట్టు చెబుతున్నారు. అయితే.. విడాకుల పత్రాలుగా చెబుతున్న డాక్యుమెంట్లను పేజీ సిక్స్ బయటపెట్టింది.
వీటి ప్రకారం.. వీరిద్దరి మధ్య విడాకుల డీల్ మే 26వ తేదీన కుదిరింది. వీరిద్దరికీ నాలుగేళ్ల కుమార్తె ఉన్నది. ఆమె ఎవరి సంరక్షణలో ఉండాలనే విషయంలో వారిద్దరూ అవగాహనకు రానున్నారని తెలుస్తున్నది. సెర్గీ విడాకుల విజ్ఞప్తిని షనాహన్ వ్యతిరేకించలేదని అయితే.. భర్త నుంచి తగిన మద్దతు మాత్రం కోరారని సమాచారం. కోర్టు ఖర్చులు, ఆస్తి పంపకాలు వంటివి రహస్యంగా కుదిరిన రాజీలో ఏకాభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు.
బ్రిన్ తన తొలి భార్యకు విడాకులు ఇచ్చిన 2015లోనే షనాహన్‌తో డేటింగ్ ప్రారంభించారు. 2018లో షనాహన్, బ్రిన్ వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే.. 2021 నుంచి వారు విడిగా ఉంటున్నారు. ఇదే క్రమంలో 2022లో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. పరిష్కరించుకోలేని విభేదాలు తమ మధ్య ఉన్నాయని ఆయన పేర్కొన్నారని తెలుస్తున్నది.
ఎలాన్ మస్క్‌తో షనాహన్‌కు ఎఫైర్ ఉన్నదని వదంతులు వచ్చిన నెల తర్వాత బ్రిన్ తన విడాకుల ప్రక్రియను ప్రారంభించారని సమాచారం. బ్రిన్, మస్క్ దీర్ఘకాలంగా స్నేహితులు. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని మస్క్, షహనాన్ ప్రకటించారు.
దీనిపై వచ్చిన వార్తలకు మస్క్ 2022 జూలై 25న ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘సెర్గీ, నేను స్నేహితులం. గత రాత్రే మేం ఇద్దరం ఒక పార్టీలో కలిశాం. నికోల్‌ను గడిచిన మూడేళ్లలో రెండు సార్లు మాత్రమే చూశాను. అన్ని సార్లూ మా చుట్టూ చాలా మంది ఉన్నారు. రొమాన్స్ అంటూ ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. షనాహన్ కూడా ఈ వార్తలను ఖండించారు.
తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని మస్క్, షహానన్ ఖండించినప్పటికీ.. ఈ వార్తను తొలుత బయటపెట్టిన వాల్‌స్ట్రీట్ జర్నల్ మాత్రం తన కథనానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకున్నది. తనకు ఈ విషయం వెల్లడించిన సోర్స్ పట్ట తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని తెలిపింది.
బ్రిన్ వయసు 50 ఏళ్లు. ప్రపంచంలో 9వ అతిపెద్ద సంపన్నుడు. ఆయన మొత్తం ఆస్తి విలువ 118 బిలియన్ డాలర్లని బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంటున్నది. షనాహన్ వయసు 34 ఏళ్లు. కాలిఫోర్నియాకు చెందిన న్యాయవాది.
