HomelatestElon Musk | ట్విట్టర్‌ సీఈవో పదవికి ఎలాన్‌ మస్క్‌ గుడ్‌బై..! కొత్త సీఈవో ఎవరంటే..?

Elon Musk | ట్విట్టర్‌ సీఈవో పదవికి ఎలాన్‌ మస్క్‌ గుడ్‌బై..! కొత్త సీఈవో ఎవరంటే..?

Elon Musk |

ట్విట్టర్‌ సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎలాన్‌ మస్క్‌ వైదొలగనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోను ఎంపిక చేశారు. ఆరువారాల్లో కొత్త సీఈవో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ప్రపంచ కుబేరుడు తెలిపారు. ఇకపై తాను కంపెనీ చీఫ్‌ టెక్నాలజిస్ట్‌గా కొనసాగడంతో పాటు ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్‌, సిసోప్స్‌లను పర్యవేక్షించనున్నట్లు మస్క్‌ ప్రకటించారు.

అయితే, కొత్త సీఈవోగా పేరును ఎలాన్‌ మస్క్‌ అధికారికంగా ప్రకటించకపోయినా.. సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ కొత్త సీఈవోగా లిండా యాకారియో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

వాల్‌స్ట్రీల్‌ జనరల్‌ సైతం లిండా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఎన్‌బీసీ యూనివర్సల్‌లో గ్లోబల్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ విభాగం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలు ఎన్‌బీసీ యూనివర్స్‌లో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా.. గతేడాది 44 బిలియన్‌ డాలర్లకు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌ఓ సహా పలువురు ఉన్నతాధికారులను తొలగించాడు.

దాదాపు 75శాతం ట్విట్టర్‌ వర్క్‌ ఫోర్స్‌ను తొలగించారు. కంటెంట్‌ నియంత్రణ, ఉత్పత్తి మార్పులను తీసుకువచ్చారు. అలాంటి బ్లూటిక్‌ తదితర సేవలను తీసుకువచ్చారు. అయితే, ట్విటర్‌ కొనుగోలు చేసిన తర్వాత పని భారం భారీగా పెరిగిందని ఓ ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. సీఈవో పదవి నుంచి వైదొలగాలా? వద్దా? అనే విషయంపై పోల్‌ను సైతం నిర్వహించారు.

ఎక్కువ మంది వైదొలగాలని సూచించగా.. తాను పదవి నుంచి వైదొలగితే ట్విట్టర్‌ను ఎవరు నడుపుతారు? అంటూ చమత్కరించాడు. అయితే, ఎవరైనా దొరికితే రాజీనామా చేస్తానన్న ఎలాన్‌ మస్క్‌.. 2023 చివరి నాటికి కొత్త సీఈవోను నియమించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త సీఈవోగా లిండాను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular