Thursday, March 23, 2023
More
    HomelatestElon Musk-Trump | అదే జరిగితే ట్రంప్‌ భారీ మెజారిటీతో ప్రెసిడెంట్‌గా గెలువడం ఖాయం :...

    Elon Musk-Trump | అదే జరిగితే ట్రంప్‌ భారీ మెజారిటీతో ప్రెసిడెంట్‌గా గెలువడం ఖాయం : ఎలాన్‌ మస్క్‌

    Elon Musk-Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను అరెస్టు చేస్తే భారీ మెజారిటీతో మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉందని టెస్లా, ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ట్రంప్‌ శనివారం తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. మాన్హాటన్ అటార్నీ జిల్లా కార్యాలయం తీసుకువచ్చిన కేసులో మంగళవారం తనను అరెస్టు చేస్తారని ట్రంప్‌ తెలిపారు. తన అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని ఆయన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించిన హస్‌- మనీ స్కీమ్‌పై ఏడాది పాటు జరిపిన విచారణకు సంబంధించి ట్రంప్‌పై నేరారోపణకు ఎలా సిద్ధం కావాలనే దానిపై రాష్ట్ర, సమాఖ్య చట్ట అమలు సంస్థలు ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

    ఈ క్రమంలో ట్రంప్‌ను త్వరలో అరెస్టు చేయనున్నట్లు ఆయన న్యాయబృందం అంచనా వేస్తుండగా. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం తనపై హష్‌ మనీ కేసులో అభియోగాలు మోపేందుకు సిద్ధమవుతుందని స్వయంగా ట్రంపే ప్రకటించారు. వాస్తానికి స్ట్రామీ డేనియల్స్‌తో సంబంధాలున్నాయని, ఈ విషయం బయటకు వెల్లడించకుండా ఉండేందుకు 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ ఆమెకు భారీగా డబ్బును చెల్లించారని ఆరోపణలున్నాయి. వీటిని ట్రంప్‌ కొట్టి పారేశారు. మరో వైపు వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో టెస్లా సీఈవో స్పందిస్తూ.. ట్రంప్‌ను అరెస్టు చేస్తే ట్రంప్‌ మరోసారి ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యే అవకాశాలుంటాయిన పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular