HomelatestCM KCR | దేశంలో ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితి.. మితిమీరిన కేంద్రం అరాచకాలు: సీఎం కేసీఆర్

CM KCR | దేశంలో ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితి.. మితిమీరిన కేంద్రం అరాచకాలు: సీఎం కేసీఆర్

CM KCR |

  • దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. గవర్నర్లు ఏంది?
  • గవర్నర్ వ్యవస్థతో పాలన ఎక్కడికి వెళ్తుందో దేశం అంతా గమనిస్తోంది.
  • వంగి వంగి కోతి దండాలు పెట్టినా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారు
  • పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్‌కు మద్దతు
  • ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి సీఎం కేసీఆర్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్

విధాత‌: దేశంలో కేంద్ర ఆరాచకాలు, ఆగడాలు మితి మీరి పోతున్నాయని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం కేసీఆర్ అనంతరం ప్రగతి భవన్‌లో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎమ‌ర్జెన్సీ కాలం నాటి ప‌రిస్థితి ఉన్న‌ద‌ని అన్నారు.

దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్నబీజేపీ యేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను సరిగ్గా పనిచేయనియ్యడం లేదన్నారు. విపక్ష పార్టీలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన ఆప్ ఢిల్లీలో మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఢిల్లీ ప్రజలను అవమానించేలా కేంద్రం తీరు ఉందన్నారు. దీనిని దేశమంతా చూస్తోందని తెలిపారు.

ఢిల్లీలో కార్పోరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించుకోనివ్వకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి ఎన్నికలు నిర్వహించుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే మేయర్ ప్రమాణ స్వీకారానికి కూడా ఇబ్బంది పెట్టారన్నారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చిందన్నారు.

గ్రూప్-1 అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే కేంద్రం ఈ తీర్పు అమలు చేయకుండా ఓవర్ టేక్ చేస్తూ కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిందన్నారు. దేశంలో సుప్రీం కోర్టు తీర్పుకు అతిగతి లేకుండా పోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు స్తున్నాయని, ఆ సంఘటనలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందిరా గాంధీ లాంటి నాయకులకే ఓటమి తప్పలేదన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాడు ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉందన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ను ఓడించేందుకు కేజ్రీవాల్ కు మా మద్దతు ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

లోక్‌సభ, రాజ్యసభలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమాణిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ వచ్చే ముందు అప్పుడు ఇలాగే జరిగిందన్నారు.

కర్ణాటక ప్రజలు బీజేపీ కి సరైన సమాధానం చెప్పారని కేసీఆర్ అన్నారు. భవిష్యత్లో దేశమంతా ఇలాగే ఉండబోతుందన్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు

ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లు హైదరాబాద్లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు శనివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ప్రగతి భవన్కు వెళ్లారు.

ప్రగతి భవన్కు వచ్చిన వారికి సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సమావేశమయ్యారు. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై చర్చించారు. ముగ్గురు సీఎంలు మధ్యాహ్నం ప్రగతి భవన్లో భోజనం చేశారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular