AMARAVATHI అమరావతి టూ అరసవల్లి రైతుల పాదయాత్ర ముగిసింది.. వెయ్యి మంది రైతులు చేశారా.. టీడీపీ నాయకులు చెబుతున్నట్లు అమరావతికి భూములు ఇచ్చిన వేల మంది రైతులు యాత్ర చేశారా.. లేక ఒక్కరే చేసారా అన్నది పక్కనబెడితే మొత్తానికి యాత్ర అయితే పూర్తయింది. అమరావతిని రాజదానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్ర 2022 సెప్టెంబర్12న అమరావతిలో యాత్ర మొదలైంది. యాత్రకు ప్రభుత్వం బ్రేకులు వేస్తూ రావడం.. అది కాస్తా కోర్టు వరకూ చేరడంతో […]

AMARAVATHI
అమరావతి టూ అరసవల్లి రైతుల పాదయాత్ర ముగిసింది.. వెయ్యి మంది రైతులు చేశారా.. టీడీపీ నాయకులు చెబుతున్నట్లు అమరావతికి భూములు ఇచ్చిన వేల మంది రైతులు యాత్ర చేశారా.. లేక ఒక్కరే చేసారా అన్నది పక్కనబెడితే మొత్తానికి యాత్ర అయితే పూర్తయింది.
అమరావతిని రాజదానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్ర 2022 సెప్టెంబర్12న అమరావతిలో యాత్ర మొదలైంది. యాత్రకు ప్రభుత్వం బ్రేకులు వేస్తూ రావడం.. అది కాస్తా కోర్టు వరకూ చేరడంతో పోలీసులకు ఐడెంటీ కార్డులు చూపించి యాత్ర సాగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రామచంద్రాపురం వద్ద పాద యాత్ర ఆపేశారు.
అయితే అరసవెల్లి వరకూ యాత్ర అని మొక్కుకున్నందు వల్ల అది మధ్యలో ఆపకూడదని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనర్ గద్దే తిరుపతిరావు ఈ నెల 11 నుంచి రామచంద్రాపురం నుంచి మళ్ళీ నడక ప్రారంభించారు. మొత్తానికి ఆయన శ్రీకాకుళంలోని అరసవెల్లికి వచ్చి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అని జగన్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుని మరీ ఇపుడు కాదనడం న్యాయమేనా అని నిలదీశారు 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని ఒప్పుకున్నదువల్లనే జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు అన్నారు. మూడున్నరేళ్ళుగా తాము ఉద్యమం చేస్తున్నామని అయినా ప్రభుత్వం కరగకపోవడం దారుణం అన్నారు.
ఇప్పటీకైనా ప్రభుత్వం మనసు మార్చాలని సూర్యనారాయణమూర్తిని ప్రార్ధించామని అన్నారు. తాము ఏపీ రాజధాని అమరావతి అని భూములుఇచ్చామని 28 గ్రామాల ప్రజలు 13 జిల్లాల శ్రేయస్సు కోసమే త్యాగం చేశాయని అన్నారు. తమది స్వార్ధం కాదని ఏపీ అభివృద్ధి కోసం వేసిన ముందడుగు అని అన్నారు. పాలకులు మారినపుడల్లా రాజధాని మారకూడదు అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వెంట యాత్రలో పాల్గొన్న కూన రవికుమార్, టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మొదటి నుంచీ ఈ యాత్రను ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే ఉంది.
ఇది రైతుల యాత్ర కాదని, టీడీపీ వాళ్ళు వెనక ఉంటూ నడిపిస్తున్న రాజకీయ యాత్ర అని, రైతుల ముసుగులో టీడీపీ వాళ్ళు యాత్రలో నడుస్తూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఈ యాత్రను అడ్డుకుంది. రైతులు తమ గుర్తింపు కార్డులు చూపాలని కోరింది.
దీని మీద రైతులు కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా కోర్టు 600 మందికి మించకుండా అదికూడా నిజమైన రైతులు, తమ గుర్తింపు కార్డులతో యాత్రలో పాల్గొనవచ్చను స్పష్టం చేయడంతో యాత్ర నిలిచిపోయింది. మొత్తానికి ఓకేఒక్కడు అన్న రీతిలో గద్దె తిరుపతి రావు యాత్రను పూర్తి చేశామనిపించారు.
