- దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం
- పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈఓ వేణు జలకలాట.
విధాత: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని నీలకంటేశ్వరాలయంలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా పుష్కరిణిలో ఈత కొట్టడంతో అపచారం చోటు చేసుకుంది. కొట్టద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా వినకుండా అభిషేకం జరుగుతుండగా దర్జాగా ఈత కొట్టడంతో అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది.
దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో ఈవో వేణు తీరుపై భక్తులు మండిపడుతున్నారు. నాలుగు ఆలయాలకు ఇంచార్జీ ఈ.ఓ.గా పనిచేస్తున్న వేణు గతంలో తాను పని చేస్తున్న ఆలయాల్లో
దురుసుగా ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. దేవదాయ శాఖ అధికారులు వెంటనే ఈవో వేణు పై చర్య తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్: నీలకంటేశ్వరాలయంలో అపచారం.. స్వామికి అభిషేకం చేస్తుండగా.. ఈత కొట్టిన ఈవో https://t.co/cdbyYP5BBC #telanganan #telugu #telugunews #nizamabad pic.twitter.com/zKxiTlngwA
— vidhaathanews (@vidhaathanews) May 26, 2023