విధాత, వరంగల్: జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని బమ్మెర గ్రామంలో భాగవతం రాసిన బమ్మెర పోతనామాత్యుని విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కలిసి ఆవిష్కరించారు.
శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బమ్మెర క్షేత్రం పెద్ద పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి కానుంది అని అన్నారు. పోతన కీర్తిని పదిమందికి తెలియజేయాలి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.