Tuesday, January 31, 2023
More
    Homelatestఆ మాటకు కట్టుబడి ఉన్నా.. నా మాటలు వక్రీకరించారు: మంత్రి ఎర్రబెల్లి

    ఆ మాటకు కట్టుబడి ఉన్నా.. నా మాటలు వక్రీకరించారు: మంత్రి ఎర్రబెల్లి

    అధిష్టానం మొట్టికాయ వేసిందా?

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 15 నుంచి 20 స్థానాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని వారిని మార్చాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

    రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 80 స్థానాలు గ్యారెంటీ అని, 15 నుంచి 20 స్థానాలలో ఎమ్మెల్యేలను మారిస్తే 90 స్థానాలు గ్యారెంటీ అంటూ చేసిన వ్యాఖ్యలపై బుధవారం మంత్రి ఎర్రబెల్లి మరిపెడలో తాజాగా వివరణ ఇచ్చారు.

    మానుకోట జిల్లా నర్సింహులపేట మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి సోమవారం పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో మంత్రి ప్రతిస్పందించారు.

    అధిష్టానం మొట్టికాయ వేసిందా?

    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కీలక వ్యాఖ్యలపై అధిష్టానం ఏమైనా తలంటిందా? లేదా తానే మీడియా వ్యాఖ్యలు, చర్చలపై ప్రతిస్పందించారా? తెలియదు కానీ, బుధవారం మరోసారి ఇదే అంశంపై మంత్రి ఎర్రబెల్లి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తానేం తప్పు మాట్లాడలేదంటూ తన వ్యాఖ్యలు వక్రీకరించారని చెప్పే ప్రయత్నం చేశారు.తన మాట పై తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

    మంత్రి ఎర్రబెల్లి వివరణ

    మంత్రి ఎర్రబెల్లి వివరణ ఆయన మాటల్లోనే.. ‘నేను మొన్నటి మీటింగ్‌లో క్లియర్గా చెప్పాను. ఈ విషయం వీడియోలో కూడా స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో ఈజీగా గెలిచే సీట్లు 80 ఖచ్చితంగా ఉన్నాయి. మరో 15 నుంచి 20 సీట్లలో సెట్చేసుకోవాలి. రాష్ట్రంలో బీజేపీతో ఒక 15 సీట్లల్లో పోటీ ఉంటది. అది కూడా కొన్ని జిల్లాల్లోనే అక్కడ కూడా బీజేపీ గెలుస్తరని కూడా చెప్పలేదు. నేను అన్న మాటలను ముక్కలు ముక్కలు చేసి వక్రీకరించి చర్చలుపెట్టారు. మరికొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌తో పోటీ ఉంటది. అది కూడా కేవలం 15నుంచి 20 స్థానాల్లో కాంగ్రెస్‌తో పోటీ మాత్రమే ఉంటది.

    కేసీఆర్ నాయకత్వంలో 100 సీట్లు గెలుస్తం. 80 పక్కాగెలుస్తం. మరో 20సీట్లలో కష్టపడాలే. నా భాష కూడా స్పష్టంగా ఉంది. కొన్ని జిల్లాల్లో బీజేపీ, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ లేదు. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ ఉందని చెప్పిన. అన్ని విషయాలు వీడియోలో స్పష్టంగానే ఉన్నాయి. వీడియో కట్‌కట్‌ చేసి వక్రీకరించారు. ఇప్పటికైనా 80 సీట్లు గ్యారెంటీ. 20 స్థానాల్లో సెట్‌ చేసుకోవాలి. ఇది వాస్తవం. హండ్రెడ్ పర్సెంట్ ఇదే మాట మీద కట్టుబడి ఉంటాను’ అంటూ మంత్రి ఎర్రబెల్లి మరోమారు స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular