దళిత సీఎం హామీ అటకెక్కించిన ఘ‌నుడు బీఆర్ ఎస్ తోనే కేసీఆర్ పతనం ప్రారంభం బీజేపీ నేత ఈటల రాజేందర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో దళితులను వంచన చేసి రాజ్యాధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. వరంగల్ వచ్చిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజేందర్ మాటల్లోనే.. ప్రధాని నరేంద్ర మోదీ12మంది దళిత బిడ్డలకు కేంద్ర కేబినెట్లో […]

  • దళిత సీఎం హామీ అటకెక్కించిన ఘ‌నుడు
  • బీఆర్ ఎస్ తోనే కేసీఆర్ పతనం ప్రారంభం
  • బీజేపీ నేత ఈటల రాజేందర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో దళితులను వంచన చేసి రాజ్యాధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. వరంగల్ వచ్చిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రాజేందర్ మాటల్లోనే.. ప్రధాని నరేంద్ర మోదీ12మంది దళిత బిడ్డలకు కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించారు. దళితబంధు గులాబీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఅర్ఎస్‌గా మారడంతోనే కేసీఆర్ పతనం మొదలయ్యింది. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది చాలక దేశంలో దోచుకోడానికి బీఅర్ఎస్ పార్టీగా మార్చాడు.

కేసీఆర్ ఛాంబర్లో ఒక్క దళిత అధికారి లేడు. ఇది రాష్ట్ర దళిత సోదరులు గమనించాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పక్కకు పెట్టి చెరుకు రైతులను కడుపు కొట్టిన ఘనత కేసీఆర్‌ది. ఆర్టీసీ వ్యవస్థలో మూడు వంతులు ప్రైవేటీకరణ చేసి సామాన్య ప్రజలను, ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అన్యాయం చేశారు.

తెలంగాణ ప్రజలను లిక్కర్ కు బానిస చేసి కార్మిక కర్షకులను దోచుకుంటున్న మహానుభావుడు కేసీఆర్. విద్యను వ్యాపారం చేసి అనుచరులకు, బినామీలకు కట్టబెట్టి సామాన్య ప్రజానీకానికి విద్యను దూరం చేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతుంది.

బీజేపీ పార్టీలో సామాన్యులు సైతం రాజ్యాధికారంలోకి వస్తున్నారు. ఆ ఘనత నరేంద్రమోదీ కి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఈటెల కోరారు. సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పార్టీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated On 20 Jan 2023 1:11 AM GMT
krs

krs

Next Story