Friday, October 7, 2022
More
  Home latest కొడాలి, లక్ష్మీపార్వతి తప్ప అందరూ స్పందించినట్టేగా !

  కొడాలి, లక్ష్మీపార్వతి తప్ప అందరూ స్పందించినట్టేగా !

  విధాత: ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే లేపింది. దాదాపు అన్ని వర్గాల వారూ స్పందిస్తున్నారు. నిన్నటి వరకూ కామ్‌గా ఉన్న జూనియర్ ఎన్టీయార్ కూడా స్పందిస్తూ ఎన్టీయార్, వైఎస్సార్ ఇద్దరూ తెలుగు ప్రజలకు ప్రీతిపాత్రులని, ఒకరి పేరును తీసేయడం ద్వారా ఆయన గౌరవం తగ్గిపోవడం.. వేరొకరి పేరు పెట్టడం వల్ల ఈయన గౌరవం పెరగడం వంటిది ఉండదు అన్నారు.

  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో జయలలిత బొమ్మలతో ఉన్న స్కూల్ బ్యాగులను అక్కడి సీఎం స్టాలిన్ పిల్లలకు పంచిపెట్టారని, కానీ ఏపీలో మాత్రం పేర్లు మారుస్తూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. మార్చాల్సింది పేర్లు కాదని. వ్యవస్థల తీరును మార్చాలని అన్నారు.

  ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, దివంగత ఎన్టీయార్ సతీమణి లక్ష్మీ పార్వతి మాత్రం ఎటూ మాట్లాడలేక ఇరకాటంలో పడిపోయారు. కొడాలి నాని కెరీర్ ప్రారంభమైందే ఎన్టీయార్ చలవతో. ఇప్పటికీ కొడాలి తాను ఎన్టీయార్ వీరాభిమానిగా గర్వంగా చెప్పుకుంటారు. ఆయనకు ఎన్టీయార్ వైఎస్సార్ జగన్ అంటే ఎంత అభిమానమో చంద్రబాబు అంటే అంత అసహ్యం. చంద్రబాబును నిర్దాక్షిణ్యంగా అమ్మానా బూతులూ తిట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు.

  అయితే ఇప్పుడు ఈ పేరు మార్పు వ్యవహారంలో ఆయనా ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. భేష్ అంటే ఎన్టీయార్ అభిమానులు ప్లస్ తన సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది. మున్ముందు ఇది ఎన్నికల్లో కూడా నష్టం చేయొచ్చు.. పేరు మార్పు పెద్ద తప్పిదం అంటే ఏకంగా జగన్‌కు కోపం వస్తే తన పోలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడిపోతుంది. అందుకే కొడాలి నాని ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితుల్లో ఉన్నారు.

  ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సైతం ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. చంద్రబాబును ఆయన మద్దతు దారులను తీవ్రంగా విమర్శించే లక్ష్మీపార్వతి ఇప్పుడు జగన్ గవర్నమెంట్‌లో తెలుగు ఏకాడమి చైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. తన భర్త పేరును వర్సిటీకి ఉంచాలని డిమాండ్ చేయడం లేదా యార్లగడ్డ మాదిరి పదవికి రాజీనామా చేయడం ఆమెకు కష్టమైన పని.

  అలాగని జగన్ నిర్ణయాన్ని సమర్థించడమూ కష్టమే.చూస్తూ చూస్తూ తన భర్త పేరును తొలగిస్తే ఊరుకోవడం కష్టమే.. అలాగని గట్టిగా వ్యతిరేకించే ధైర్యం కూడా లేదు.. కాబట్టి ఈవిడ కూడా కక్కలేక.. మింగలేక అన్నట్లుగా ఉంటున్నారు.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page