Saturday, January 28, 2023
More
  Homelatestఆదిపురుష్‌పై మళ్లీ అంచనాలు పెంచుతున్నారు

  ఆదిపురుష్‌పై మళ్లీ అంచనాలు పెంచుతున్నారు

  విధాత‌: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. వాస్తవానికి రాబోయే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాలని కూడా భావించారు. కానీ విఎఫ్ఎక్స్ పనులు బాగా లేకపోవడంతో విడుదలైన టీజర్‌కు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది.

  దాంతో ప్రభాస్ పట్టు పట్టి మరలా మొదటి నుంచి విఎఫ్‌ఎక్స్ పనులపై దృష్టి సారించేలా చేశాడు. దాంతో ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ చిత్ర టీజ‌ర్ చూసినవారు ఇదేదో నాడు కూతురి దర్శకత్వంలో రజినీకాంత్ చేసిన విక్రమసింహాలా యానిమేటెడ్‌, కార్టూన్ ఫిల్మ్‌ల‌ను పోలి ఉందని కామెంట్లు చేశారు.

  ఆదిపురుష్ సినిమా మీద వ‌చ్చిన‌న్ని ట్రోల్స్ ఈ మధ్యకాలంలో ఇంకే సినిమా మీద వచ్చి ఉండవని కచ్చితంగా చెప్పవచ్చు. ఆదిపురుష్ విఎఫ్‌ఎక్స్ టీమ్ మీద దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. రాముడి లుక్.. వానరసైన్యం ఇలా ఏ ఒక్కటి కూడా బాగాలేదు అంటూ కామెంట్స్ వచ్చాయి.

  ఆదిపురుష్ సినిమా కోసం దేశమంతా ఎంతగానో ఎదురు చూడ సాగింది. కానీ చిన్న టీజర్ రావడంతో కథంతా మారిపోయింది. అందులోని విఎఫ్ఎక్స్ చూసి జనాలు నవ్వుకున్నారు. రాముడి లుక్ సరిగ్గా లేదంటూ రావణుడు ఇలా ఉంటాడా హనుమంతుడు ఇలా కనిపిస్తాడా వానరసైన్యం ఏంటి ఇలా ఉంది అంటూ నానా రకాలుగా కామెంట్ చేశారు.

  ఇక రాముడు ఆంజనేయుడు చర్మంతో తయారు చేసిన దుస్తుల‌ను ధ‌రిస్తారా అలా ఎందుకు చూపించారు అంటూ.. నానా రకాల ప్రశ్నలు సంధించారు. దాంతో ఈ టీమ్ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాను మొబైల్ కోసం తీయలేదని థియేటర్లలో చూసేందుకు తీశామని 3డిలో చూస్తే అనుభూతి వేరు అంటూ ఓంరౌత్ తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
  కానీ చివరకు రిపేర్లు మొదలు పెట్టేశారు.

  ఆదిపురుష్‌ సినిమా వీఎఫ్ఎక్స్ ప‌నులు పూర్తి కావచ్చింది. మ‌రో 100 కోట్లు పెట్టి రిపేరు చేయిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓంరౌత్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు ఈ సినిమా విషయంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి మేము వాటిని స్వీకరించాం. అయితే విఎఫ్ఎక్స్ టీమ్ కొన్నిచోట్ల అద్భుతంగా పనిచేసింది. ఇంకొన్ని చోట్ల మేము కరెక్షన్స్ చేయాల్సి ఉంది. వాటిని మేము సరిచేస్తున్నాం.

  మనం తీసే సినిమా విషయంలో చివరి నిమిషం వరకు మనం కష్టపడాల్సిందే మన ప్రొడక్ట్ బాగా రావడానికి మనం చివరి వరకు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. నేను ఏ ఒక్కరిని నిరాశపర‌చ‌ను. నేటి యువతకు, ప్రపంచానికి మన రాముడిని చూపించాలని ఆయన గురించి చెప్పాలని చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ ఓంరౌత్ చెప్పుకొచ్చాడు.

  ఏమైనా ఈ చిత్రం కొత్త టీజర్, ట్రైలర్ విడుద‌ల కానిదే మనం ఓ నిర్ణయానికి రాలేం కూడా. ప్ర‌భాస్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఆయన సలార్ మూవీని వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఆదిపురుష్‌ విషయంలో ఏదైనా తేడా వచ్చినా మ‌రోసారి విఎఫ్ఎక్స్ పనులను మొదలుపెట్టించేలా ఆయన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

  వీలైతే ఆదిపురుష్‌ను వెనక్కి నెట్టి సలార్ మూవీతో ముందుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడు. మరి ఆదిపురుష్, సలార్‌లలో ఏ చిత్రం ముందుగా విడుదలవుతుందో చూడాలి. ఎందుకంటే ఆదిపురుష్‌పై ఇంకా టీజర్‌ని చూసిన ప్రేక్షకులకు ఓం రౌత్ ఎంత చెప్పినా నమ్మకం కుదరడం లేదు.

  దీనిబట్టి సినీ ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు సంతృప్తి పడేలా ఆదిపురుష్ పూర్తి అవుట్ ఫుట్ వచ్చిన తర్వాతే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే సాహసం చేస్తారని లేకపోతే ఆలస్యమైనా కాస్త సమయం తీసుకుంటారని మరింత డబ్బు వెచ్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular