విధాత, నిజామాబాద్: కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముందు గల బారికేడ్లను జనం లాక్కెల్లి దూరం పడేశారు. గేట్లపై నుండి లోనికి చొరబడేందుకు యత్నించారు. బండి సంజయ్ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో పరామర్శించారు. అనంతరం అక్కడి నుండి […]

విధాత, నిజామాబాద్: కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు.

కలెక్టర్ కార్యాలయం ముందు గల బారికేడ్లను జనం లాక్కెల్లి దూరం పడేశారు. గేట్లపై నుండి లోనికి చొరబడేందుకు యత్నించారు. బండి సంజయ్ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో పరామర్శించారు.

అనంతరం అక్కడి నుండి సమస్యను తేల్చుకునేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. నేరుగా అడ్లూర్ ఎల్లారెడ్డి నుండి బయలుదేరి ఇల్చిపూర్, అడ్లూర్ మీదుగా కలెక్టరేట్ కు భారీ కాన్వాయ్ తో చేరుకున్నారు.

కలెక్టరేట్ కు చేరుకున్న వెంటనే ఆయన వెంట తరలి వచ్చిన జనం ముకుమ్మడిగా కార్యాలయం గేట్లపై దాడి చేశారు. పెద్దపెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారులు పోలీసులు పరస్పరం తోసుకున్నారు.

ఇదిలా వుండగా మరికొంత మందిని పోలీసులు బారికేడ్లు అడ్డంగా పెట్టి జాతీయ రహదారి బై పాస్ రోడ్ వద్దే ఆపేశారు. కాగా కలెక్టర్ ను కలిసేందుకు మరో గేట్ నుండి సంజయ్ ను పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లారు.

Updated On 6 Jan 2023 4:16 PM GMT
krs

krs

Next Story