- భూము కోల్పోతున్న రైతుల ఆందోళన
- పట్టించుకోని ప్రభుత్వం.. రైతు ఆత్మహత్య
- మృతదేహాన్ని మున్సిపల్ కార్యాలయం వరకు తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులు
విధాత, నిజామాబాదు: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని భూముల విభజనలో భాగంగా ఇండస్ట్రియల్ జోన్ లో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చేస్తున్నారు.
రోజుకో విధంగా నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు (36) అనే రైతు బుధవారం బలవర్మణానికి పాల్పడ్డాడు.
దీంతో రాములు మృతదేహాన్ని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దకు తరలించి ధర్నా నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో కామారెడ్డికి ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రానున్నారు.