Facebook | సాధారణంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లతో ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ దెబ్బతుంటనేది బహిరంగ రహస్యమే. స్మార్ట్‌ ఫోన్లలోని యాప్స్‌ కారణంగా డేటా వినియోగంతో పాటు బ్యాటరీ సైతం త్వరగా అయిపోతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే, ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగా స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీలను హరిస్తోందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. హేవార్డ్ మాజీ కంపెనీ ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగా యూజర్ల సంబంధించిన ఫోన్ల బ్యాటరీలను దెబ్బతీస్తుందని […]

Facebook | సాధారణంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లతో ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ దెబ్బతుంటనేది బహిరంగ రహస్యమే. స్మార్ట్‌ ఫోన్లలోని యాప్స్‌ కారణంగా డేటా వినియోగంతో పాటు బ్యాటరీ సైతం త్వరగా అయిపోతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే, ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగా స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీలను హరిస్తోందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. హేవార్డ్ మాజీ కంపెనీ ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగా యూజర్ల సంబంధించిన ఫోన్ల బ్యాటరీలను దెబ్బతీస్తుందని ఆరోపించారు.

ఏదైనా యాప్ ఎంత వేగంగా రన్ అవుతుంది ? లేదా ? ఎంత త్వరగా లోడ్ అవుతుంది అనేది పరీక్షిస్తారు. విభిన్న ఫీచర్లు.. ఆయా యాప్‌లతో సమస్యలను టెస్టింగ్ చేయడానికి నిర్వహిస్తుంటారు. అయితే, ఈ టెస్టింగ్‌తో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీపై ప్రభావం పడుతుందనేది యూజర్లకు తెలియదు. ఫేస్‌బుక్ కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంలో హేవార్డ్ పద్ధతి డేంజరస్‌ అని తెలిపాడు. ఈ పద్ధతిని నిలిపివేయాలంటూ డిమాండ్‌ చేశాడు. ఈ మాజీ ఉద్యోగి మాన్‌హాటన్ ఫెడరల్ కోర్టులో ఫేస్‌బుక్‌పై దావా దాఖలు చేశారు.

నెగటివ్ టెస్టింగ్‌లో పాల్గొనడానికి నిరాకరించినందుకు ఫేస్‌బుక్‌ కంపెనీ నుంచి తొలగించినట్లు కంపెనీ నుంచి తొలగించిందని ఆరోపించాడు. హేవార్డ్‌ ఫేస్‌బుక్‌ మెస్సేంజర్‌ యాప్‌లో కొంతకాలం పని చేశాడు. అయితే, ఇది ఏ ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫార‌మ్‌లా ఉండదని, అందుకే ఈ టెస్టింగ్ చేయడానికి నిరాకరించానని పేర్కొన్నాడు. ఫేస్‌బుక్ నెగటివ్ టెస్టింగ్ కారణంగా ప్రభావితమైన యూజర్లు ఎంతమంది ఉన్నారు అనేది కచ్చితమైన సంఖ్య తెలియదని చెప్పాడు.

Updated On 2 Feb 2023 6:47 AM GMT
Vineela

Vineela

Next Story