విధాత: ప్రేమకు హద్దుల్లేవు.. ప్రేమించుకోవడానికి సరిహద్దుల్లేవు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన భారతీయుడ్ని.. స్వీడన్‌కు చెందిన యువతి పెళ్లి చేసుకుంది. ఈ ఫేస్ బుక్ ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. 2012లో ఏర్పడిన ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు కలవడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం యూపీలోని ఎటావా జిల్లాలోని ఓ పాఠశాలలో హిందూ సంప్రదాయాల ప్రకారం శుక్రవారం ఘనంగా జరిగింది.
उत्तर प्रदेश: स्वीडन की युवती को फेसबुक पर भारतीय युवक से प्यार हुआ, भारत पहुंचकर युवती ने युवक से विवाह किया।
क्रिस्टन लिबर्ट ने कहा, "मैं भारत इससे पहले भी आई हूं, मुझे भारत बेहद पसंद है और मैं इस शादी से बेहद खुश हूं।" (28.01) pic.twitter.com/eaw8UWnO1s
— ANI_HindiNews (@AHindinews) January 28, 2023
ఈ సందర్భంగా క్రిస్టేన్ లైబర్ట్ మాట్లాడుతూ.. పవన్‌తో తనకు 2012లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందన్నారు. ఇండియాకు రావడం ఇది తొలిసారి కాదన్నారు. గతంలోనూ భారత్‌కు వచ్చానని తెలిపారు. గతంలో ఒకసారి ప్రేమకు చిహ్నమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద పవన్‌ను కలిశానని క్రిస్టేన్ చెప్పుకొచ్చారు. నేను భారత్‌ను ప్రేమిస్తానని, ఇప్పుడు పవన్‌ను పెళ్లి చేసుకోవడం మరింత సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
యూపీకి చెందిన పవన్ కుమార్.. డెహ్రాడూన్‌లో తన ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పవన్ పని చేస్తున్నారు. స్వీడన్ యువతిని తన కుమారుడు పెళ్లి చేసుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ తండ్రి గీతం సింగ్ స్పష్టం చేశారు.