Sunday, November 27, 2022
More
  Homelatestహోం లోన్ వ‌రుస‌గా 3 నెల‌లు చెల్లించ‌క‌పోతే.. జ‌రిగేది ఇదే!

  హోం లోన్ వ‌రుస‌గా 3 నెల‌లు చెల్లించ‌క‌పోతే.. జ‌రిగేది ఇదే!

  విధాత : మ‌నం ఇల్లును క‌ట్టాల‌నుకున్న‌ప్ప‌డు త‌ప్ప‌నిస‌రిగా హోం లోన్ తీసుకుంటాం. బ్యాంకులు లేదా ప్ర‌యివేటు సంస్థ‌ల నుంచి తీసుకున్న ఆ హోం లోన్ క‌నీసం 15 నుంచి 20 సంవ‌త్స‌రాల పాటు ఉంటుంది. ఇక ఆ 20 ఏండ్ల పాటు మ‌నం తీసుకున్న అప్పును బ‌ట్టి, చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా, స‌మ‌యానికి డ‌బ్బు లేక‌పోవ‌డం కార‌ణంగానో ఒక్కో నెల ఈఎంఐ చెల్లించ‌డంలో ఆల‌స్యం అవుతుంది. అలాంట‌ప్పుడు మ‌న క్రెడిట్ స్కోర్‌కు ప్ర‌మాదం ఉంటుంది. అయితే వ‌రుస‌గా మూడు నెల‌ల పాటు అప్పు చెల్లించ‌క‌పోతే.. జ‌రిగే ప‌రిణామాలు ఏంటో చూద్దాం.

  మీ ఈఎంఐ డేట్ వ‌స్తుందంటే చాలు.. స‌ద‌రు బ్యాంకు మీకు మెయిల్స్‌, ఎస్ఎంఎస్ పంపి మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేస్తుంది. స‌కాలంలో డ‌బ్బులు చెల్లించ‌క‌పోతే లేట్ ఫీ లేదా జ‌రిమానా విధిస్తుంది. ఈ జ‌రిమానాలు సాధార‌ణంగా మొత్తం అప్పుకు 1 నుంచి 2 శాతం వ‌ర‌కు విధించ‌డం జ‌రుగుతుంది. ఈ ఆల‌స్య రుసుం ఈఎంఐతో పాటు చెల్లించాల్సి ఉంటుంది.

  మీరు వ‌రుస‌గా రెండో నెల‌లో కూడా ఈఎంఐ చెల్లించ లేద‌నుకోండి. మ‌ళ్లీ మీకు బ్యాంకు మేసేజ్ పంపుతుంది. వీలైనంత త్వ‌ర‌గా ఈఎంఐ చెల్లించండి అని. అయిన‌ప్ప‌టికీ బ్యాంకుకు రుణం చెల్లించ‌లేదు. మూడో నెల కూడా వ‌చ్చేసింది. ఆ స‌మ‌యంలో కూడా మీరు ఈఎంఐ చెల్లించ‌క‌పోతే.. మిమ్మ‌ల్ని నాన్ ఫ‌ర్‌ఫ‌ర్మారింగ్ అసెట్(NPA) కింద పేర్కొంటుంది. లీగ‌ల్‌గా మీపై చ‌ర్య‌లను బ్యాంకు ప్రారంభిస్తుంది. 60 రోజుల్లో మీరు మీ అప్పును సెటిల్‌మెంట్ చేసుకోవాల‌ని అప్పు తీసుకున్న వ్య‌క్తికి బ్యాంకు లీగ‌ల్ నోటీసులు పంపిస్తుంది. 60 రోజుల్లో కూడా ఈఎంఐ చెల్లించ‌క‌పోతే.. కోర్టుతో సంబంధం లేకుండా మీ ఆస్తిని బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది. మీ ఆస్తిని బ‌హిరంగ వేలం వేస్తున్న‌ట్లు తెలుపుతుంది.

  అయితే మీరు స‌కాలంలో బ‌కాయిలు చెల్లించ‌క‌పోతే మీ క్రెడిట్ స్కోరుతో పాటు భ‌విష్య‌త్‌లో తీసుకునే రుణాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. కాబ‌ట్టి తీసుకున్న అప్పుల‌ను స‌కాలంలో చెల్లించి, క్రెడిట్ స్కోర్‌తో పాటు మీ విలువైన ఆస్తుల‌ను కాపాడుకోవ‌చ్చు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page