HomelatestSatyapal Malik | 2024లో.. BJP పతనం తథ్యం: మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్

Satyapal Malik | 2024లో.. BJP పతనం తథ్యం: మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్

Satyapal Malik |

  • పుల్వామా వారిని తినేస్తుంది

విధాత: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం తథ్యమని, పుల్వామా వారిని తుడిచిపెడుతుందని జమ్మూ కశ్మీరు మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ (SatyaPal Malik) అన్నారు. ది వైర్‌ జర్నలిస్టుతో మాట్లాడుతూ తనను బెదిరించాలని చూస్తున్నారని, తాను భయపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.

సత్యపాల్‌ మాలిక్‌ జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయన వద్ద సహాయకులుగా పనిచేసిన వారి ఇళ్లపై సీబీఐ దాడులు జరిపింది. ఇన్సూరెన్సు అవినీతికి సంబంధించిన కేసులో ఈ దాడులు జరిపినట్టు సమాచారం. తాను చేసిన అవినీతి ఆరోపణల గురించి కనీసం విచారణ చేయకుండా తన సహాయకులపై దాడులు చేస్తున్నారని సత్యపాల్‌ మాలిక్‌ ది వైర్‌తో చెప్పారు.

రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్సు పథకాన్ని ఆమోదించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకుడు రాంమాధవ్‌ తనపై ఒత్తిడి తెచ్చారని, తాను ఆ పథకాన్ని తిరస్కరించానని మాలిక్‌ ఇటీవల ఒక ఇంటర్‌వ్యూలో వెల్లడించారు.

ఏప్రిలు 28న సీబీఐ సత్యపాల్‌ మాలిక్‌ను కూడా ప్రశ్నించింది. నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. వారు పదవి నుంచి దిగిపోయేదాకా నా పోరాటం ఆగదు. మీరు చూస్తూ ఉండండి. 2024లో వారి పతనం తథ్యం. పుల్వామా వారిని సజీవంగా మింగుతుంది అని సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular