ఉన్నమాట: ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం బీజేపీకి మొదటి నుంచి అలవాటే. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ తేదీ వరకు రకరకాల ప్లాన్లను ఆ పార్టీ అమలు చేస్తూ ఉంటుంది. అది ఇప్పటి ఎలక్షన్ల తీరుకు అద్దం పడుతుంది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం పోటీ చేసే అభ్యర్థి ఓటర్ల సానుభూతి కోసం కాళ్లకు, చేతులకు కట్టు కట్టుకోవడం మొదలు ఓట్ల కోసం మతపరమైన […]

ఉన్నమాట: ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం బీజేపీకి మొదటి నుంచి అలవాటే. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ తేదీ వరకు రకరకాల ప్లాన్లను ఆ పార్టీ అమలు చేస్తూ ఉంటుంది. అది ఇప్పటి ఎలక్షన్ల తీరుకు అద్దం పడుతుంది.
పోటీ చేసే అభ్యర్థి ఓటర్ల సానుభూతి కోసం కాళ్లకు, చేతులకు కట్టు కట్టుకోవడం మొదలు ఓట్ల కోసం మతపరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇవేవీ తమను గట్టెక్కించలేవని తెలిస్తే దాడులు చేయడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ఆ పార్టీకి అలవాటే అని వివపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది.
కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు#ManaMunugodeManaCongress #MunugodeWithCongress
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2022
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి బీజేపీ ప్రచారం చూసినా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహార శైలి చూసినా, ఆ పార్టీ నేతలకు ప్రజల నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారు చేసిన ఎదురుదాడి చూసినా ఇవన్నీ కావాలనే చేసినట్లు మనకు అర్థమౌతుందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పువ్వు + కారు = పుకారు
కాంగ్రెస్ పైన దుబ్బాకలో ఎన్నిక రోజు బీజేపీ టీఆర్ఎస్ చేసిన ఫేక్ ప్రచారమే ఈరోజు మునుగోడు లో చేస్తున్నారు, మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమ్ముడు పోయిందని BJP దుర్మార్గమైన విష ప్రచారాన్ని తిప్పికొట్టండని మునుగోడు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి 🙏🏻#Munugode pic.twitter.com/Ey6nVkHxWp
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) November 3, 2022
ఒక్క ఉప ఎన్నికలో గెలవడానికి టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలు చేస్తున్నదని సంజయ్, ఈటల వంటి నేతలు విమర్శించారు. అయితే తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీ ఇంట్లో ఈ 6 రకాల ఫోటోలు ఉన్నాయా..? అయితే అంతా శుభమే జరుగుతుందట..
మునుగోడు ప్రజలకు అంతా తెలుసు. పాలు, నీళ్లలా ఎవరు ధర్మం వైపు ఉన్నారో ఎవరు అధర్మం వైపు ఉన్నారో స్పష్టంగా వేరు చేస్తారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ చేసే కుట్రలను మునుగోడు ప్రజలు తిప్పి కొడతారని స్పష్టం చేశారు.
అయితే మునుగోడు ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల ముందు నుంచే ఇరు పార్టీల మధ్య మాటల, భౌతిక దాడులే కాకుండా అసత్య ప్రచారాలు కూడా సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నాయి.
అక్కడి ఫలితం ఇంకా తేలకముందే వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నాడని కొందరు, ఓటమికి నాదే బాధ్యత అని బండి సంజయ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ రాశాడంటూ మరికొందరు ఇలా ఎవరికి వారు కథలు అల్లుతూ, అల్రెడీ అల్లిన కథలను తమ తమ గ్రూపులలో షేర్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.
నవంబర్ 6న ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ అభ్యర్థి ఆస్ట్రేలియాకు చెక్కేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే వార్త ఒకటి వైరల్ అయ్యింది. అలాగే పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్‌ను కలిశారంటూ ఫేక్ ఆడియో ఒకటి విడుదలైంది.
మునుగోడు ఆడబిడ్డ పై విషప్రచారం
పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్ ను
కలిశారంటూ నకిలీ వీడియోమునుగోడు ఆడబిడ్డ గెలుస్తుంది అనే భయంతో చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు.
మీరు ఎన్ని వేషాలు వేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం.@revanth_anumula @INCTelangana pic.twitter.com/JNDcdqLMMk
— Congress for Telangana (@Congress4TS) November 3, 2022
అదేవిధంగా టీఆర్‌ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటలను కలిశారని రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలిపారంటు ఓ ఫేక్ న్యూస్ హల్‌చల్ అవుతుంది. ఇలా ప్రచారం మొదలైన నాటి నుంచి పోలింగ్ తేదీ ముందు రోజు వరకు టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అన్ని రకాల రాజకీయ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
బీజేపీ పార్టీ ప్రచారం చేస్తున్నఫేక్ న్యూస్ పై స్పందించిన టిఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్ 👇 pic.twitter.com/QEOuQCW5uO
— KTR News (@KTR_News) November 3, 2022
అయితే ఏది ఎలా ఉన్నా ఓటు వేయాల్సి మునుగోడు నియోజకవర్గ ప్రజలే గానీ వాట్సప్ యూనివర్సిటీ కార్యకర్తలు, గ్రాడ్యయేట్స్,సోషల్ మీడియా వారియర్స్ కాదు. అయినా ఒకరు చెప్పారని ప్రజలు ఓటు వేస్తారనుకుంటే మనకన్నా అజ్ణానులు మరొకరు ఉండరు.
