Tuesday, January 31, 2023
More
  Homelatestమెగా ఫ్యామిలీ టార్గెట్.. రోజాపై విరుచుకు పడుతున్న ఫ్యాన్స్

  మెగా ఫ్యామిలీ టార్గెట్.. రోజాపై విరుచుకు పడుతున్న ఫ్యాన్స్

  విధాత‌: ఆమె ఎంత ఫైర్ బ్రాండ్ అయినా కావచ్చు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయి ఉండవచ్చు. ప్రస్తుతానికి ఆమె నగిరి ఎమ్మెల్యే పైగా మంత్రి కూడా.. ఆమే ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి. వాస్తవానికి సెల్వ‌మ‌ణికి ఈమెకి మొద‌ట్లోనే ప్రేమ చిగురించింది. ‘చామంతి’ చిత్రం తర్వాత సెల్వ‌మ‌ణి దర్శకత్వంలో భారీగా సుమన్, రఘు హీరోలుగా రోజా కీలక పాత్ర పోషిస్తూ ‘సమరం’ అనే చిత్రం రూపొందింది. ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇలా చెప్పుకుంటూ పోతే రోజా ఫ్యామిలీ విషయంలో కూడా ఎన్నో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

  ఇవన్నీ తెలిసినప్పటికీ ఆ స్థాయికి దిగజారి మాట్లాడటం ఇష్టం లేక చాలామంది మౌనంగా ఉంటారు. కానీ తనను తాను ఫైర్‌బ్రాండ్‌గా నిరూపించుకునే ప్రయత్నంలో రోజా మాత్రం నోటి దురుసుతనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. ఆమె మాట్లాడుతున్న తీరు చూసి.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆచితూచి మాట్లాడాల్సిన ఆమె ఇలా చీప్ కామెంట్స్ చేయడం అవసరమా? అని అనిపించక‌మానదు. రాజకీయాల‌లో విమర్శలు మామూలే కానీ రోజా మాత్రం హద్దులు మీరి కామెంట్లు చేస్తోంది. ఎవరైనా ఆమె స్థాయికి దిగజారి మాట్లాడలేరా? సినీనటిగా ఉన్నప్పుడు రోజా చేసిన పనులు ఎవరికీ తెలియవా? మంత్రిగా ఆమె చేస్తున్న పని ఎవరికీ తెలియదు అనుకుంటుంటోంది.

  పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటే సరిపోతుందా? అయితే ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేక కాదు. సభ్యత, సంస్కారం ఆలోచిస్తే సరే మనకెందుకులే అని పక్కన పెట్టేస్తారు. విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది. దానిని మీర‌కూడ‌దు. రాజ‌కీయాల‌లో విమ‌ర్శ‌ల‌కు ఒక ల‌క్ష్మ‌ణ గీత ఉంటుంది.

  తాజాగా రోజా పవన్ కళ్యాణ్‌ను విమర్శించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని విమర్శలోకి లాగారు. చిరంజీవి ఆయన తమ్ముళ్ల వల్ల ప్రజలకు ఉపయోగమేమీ లేదు అంటూ విమర్శించింది. మంత్రి పదవి రాగానే రోజా హడావుడిగా తన కుటుంబ సభ్యులందరినీ వెంటేసుకొని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళింది. అక్కడ భోజనం చేసి వస్తూ చిరంజీవితో నవ్వుతూ ఫోటోలు కూడా దిగింది.

  అయినా చిరంజీవి ఆయ‌న త‌మ్ముళ్ల వ‌ల్ల ప్రయోజనం లేదని చెప్పడానికి ఆమె ఎవరు? చిరంజీవి వ‌ల‌న ప్రజలకు ఉపయోగముందో లేదో ప్రజలకు తెలుసు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ లతోపాటు కరోనా సమయంలో రాష్ట్రం వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఘనత చిరంజీవిది.

  ఆమె అనుకున్నట్లు ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకులను రన్ చేయడం అంత సులభం కాదు. రోజుకి ఖర్చు లక్షల్లో ఉంటుంది. వాటిని భద్రపరచాలన్నా, చెడిపోకుండా వాటిని ఉపయోగంలో ఉంచాలన్నా ఎన్నో లక్షల ఖర్చు అవుతాయి. అంతేనా సినీ కార్మికుల కోసం కూడా చిరు కరోనా సమయం నాటి నుండి తన స్థాయికి తగ్గట్టుగా సాయం చేస్తూనే ఉన్నారు.

  రాబోయే కాలంలో అసలు తన జీవితం మొత్తం జనాలకి అంకితం చేస్తానని, తనకు పదవులు వద్దు అని, దేవుడు తనకిచ్చింది చాలని చెప్పాడు. దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఇంతకాలం నా కుటుంబం గురించి ఆలోచించాను. ఇకపై మాత్రం నా సినిమా సంపాదన నుంచి ప్రతి ఒక్కటి సమాజానికే ఇచ్చేస్తాను అని ఓపెన్‌గా చెప్పాడు.

  సరే చిరంజీవి వ‌ల‌న ప్రజలకు ఉపయోగం లేదు. మరి రోజా వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి మన భావితరం? ఆమె నుండి తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి? ఆమె మాట్లాడే డిక్కీ బలిసిన కోడి… నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా వంటి మాటలు భావితరాలు నేర్చుకోవాలనే ఉద్దేశంగా కనిపిస్తోంది.

  దాంతో సోషల్ మీడియా వేదికగా రోజాని మెగా ఫాన్స్ కడిగిపారేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా గొప్ప కార్యక్రమాన్ని చిరంజీవి చేపడుతున్న విషయాలన్నీ ప్రస్తావిస్తున్నారు. ఇవేవీ రోజాకి కనిపించడం లేదా అని అంటున్నారు. చిత్రమేమంటే ప్రతి విషయంలోనూ రోజాను వెనకేసుకొచ్చే బులుగు మీడియాలో సైతం చిరంజీవిపై రోజా విమర్శలను తప్పుపడుతుండడం విశేషం.

  కోవిడ్ కష్టకాలంలో వైసీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చిరు తను రాజకీయాల్లో లేకపోయినా తన స్థాయిలో చేయాల్సిన ఆక్సిజన్ ప్లాంట్ల విషయం నుంచి ఎన్నో విషయాల్లో సాయం చేశారు. సినీ పరిశ్రమలోని ఎందరో కార్మికులను ఆదుకున్నారు. మరి రోజా సినీ పరిశ్రమలో ఇంత సాధించింది.. సంపాదించింది.. మరి ఆమె కార్మికులకు ఏమైనా సాయం చేసిందా? అన్‌స్టాపబుల్ టాక్ షో కి పవన్ కళ్యాణ్ వెళితే.. ప్యాకేజీ తీసుకుని ఆ షోకి వెళ్లాడ‌ని విమర్శలు చేస్తోంది. అంటే ఆ టాక్ షో కి వెళ్లడానికి పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు.

  మరి ఈ టీవీ జబర్దస్త్ లో చేసిన రోజా ఎంత ప్యాకేజీ తీసుకుంది? పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ఇంటికి రోజా వెళ్లడం ద్వారా ఏ ప్యాకేజీకి ఆమె కక్కుర్తి పడినట్లు? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. పిలవని పేరంటానికి వెళ్లి భోజనం చేసి వచ్చి ఫోటోలు తీయించుకొని నానా హంగామా చేసింది. అయినా రోజాను అనడం అనవసరం. అలాంటి వారిని అందలం ఎక్కిస్తోన్న ప్ర‌జ‌ల‌దే త‌ప్పు అని చెప్పాలి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular