టికెట్‌కు సరిపడ వినోదం. కుటుంబ సమేతంగా వీక్షణం Telugu films | విధాత: తెలుగు వారు ఫాంటసీ, సోషియో ఫాంటసీ, జానపద, చారిత్రాక సినిమాలు తీస్తే అవి ట్రెండ్ సెట్టర్స్ గా నిలువడం బ్లాక్ ఆండ్ వైడ్ చిత్రాల కాలం నుంచే రుజువైంది. ఈ మధ్య కార్తికేయ, బింబిసార, విరూపాక్ష లాంటి చిత్రాలతో మళ్లీ ఫాంటసీ సినిమాలకి గిరాకీ పెరిగింది. ఆ మధ్యలో ఆధిత్య 369 సైన్స్ ఫిక్షన్‌గా, బైరవ ద్వీపం జానపద చిత్రంగా అలరించింది. ఇక […]

  • టికెట్‌కు సరిపడ వినోదం.
  • కుటుంబ సమేతంగా వీక్షణం

Telugu films |

విధాత: తెలుగు వారు ఫాంటసీ, సోషియో ఫాంటసీ, జానపద, చారిత్రాక సినిమాలు తీస్తే అవి ట్రెండ్ సెట్టర్స్ గా నిలువడం బ్లాక్ ఆండ్ వైడ్ చిత్రాల కాలం నుంచే రుజువైంది. ఈ మధ్య కార్తికేయ, బింబిసార, విరూపాక్ష లాంటి చిత్రాలతో మళ్లీ ఫాంటసీ సినిమాలకి గిరాకీ పెరిగింది. ఆ మధ్యలో ఆధిత్య 369 సైన్స్ ఫిక్షన్‌గా, బైరవ ద్వీపం జానపద చిత్రంగా అలరించింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల జగదేక వీరుడు అతిలోక సుందరి ఫాంటసీ చిత్రం ఘన విజయం ఆ చిత్రాన్ని ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటిగా నిలిపింది. తదుపరి అరుంధతి, బాహుబలి డిఫరెంట్ జోన్‌లలో రూపుదిద్దుకుని ప్రేక్షకులను అలరించాయి.

ఫాంటసీ, సోషియో ఫాంటసీ, జానపద, చారిత్రాక తరహా చిత్రాల ఆదరణకు ఈ రోజుల్లో భారీగా పెరిగిన టికెట్ ధరకు తగ్గ వినోదంతో పాటు కుటుంబంతో సహా సినిమా చూడవచ్చన్న ప్రేక్షకుల దృక్పథం అదనపు బలమని భావించవచ్చు.

రాబోయే భారీ ఫాంటసీ సినిమాల్లో ముఖ్యమైనదిగా చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో వస్తున్న చిత్రమని చెబుతున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఎవరూ తీయని విధంగా భారీ స్టైల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని, ఒక పాప చుట్టూ కథ తిరుగుతుందన్న వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని, అంచనాలను కల్గిస్తున్నాయి.

చిరంజీవికి మరో జగదేక వీరుడు అతిలోక సుందరి స్థాయి చిత్రం అవ్వనుందని ఇండస్ట్రీ టాక్. మరి ప్రేక్షకుల అంచనాలను ఆ చిత్ర నిర్మాణం ఎంత మేరకు అందుకోగలుతుందన్నది వేచి చూడాల్సిందే.

Updated On 6 Sep 2023 12:41 PM GMT
somu

somu

Next Story