విధాత: చౌటుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో పోలింగ్ ముందుకు సాగడం లేదు. డబ్బులు అందలేదని అంతంపేట ఓటర్లు పోలింగ్ బూత్‌కి రాకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. దీంతో గ్రామంలో పోలింగ్ మధ్యాహ్నం వరకు 2500 ఓట్లకు గాను 200 మాత్రమే పోల్ కావడం చర్చనీయాంశమైంది. ఒక పార్టీ నుంచి కొంతమందికి డబ్బులు అందడం.. మరో పార్టీ వారు మొత్తానికే డబ్బులు పంపిణీ చేయక పోవడంతో తమకు డబ్బులు అందాకే ఓట్లు వేస్తామంటూ గ్రామస్తులు మొండికేశారు. ఎలక్షన్‌ను బహిష్కరించారు.. ఆంధ్రప్రదేశ్ […]

విధాత: చౌటుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో పోలింగ్ ముందుకు సాగడం లేదు. డబ్బులు అందలేదని అంతంపేట ఓటర్లు పోలింగ్ బూత్‌కి రాకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. దీంతో గ్రామంలో పోలింగ్ మధ్యాహ్నం వరకు 2500 ఓట్లకు గాను 200 మాత్రమే పోల్ కావడం చర్చనీయాంశమైంది.
ఒక పార్టీ నుంచి కొంతమందికి డబ్బులు అందడం.. మరో పార్టీ వారు మొత్తానికే డబ్బులు పంపిణీ చేయక పోవడంతో తమకు డబ్బులు అందాకే ఓట్లు వేస్తామంటూ గ్రామస్తులు మొండికేశారు. ఎలక్షన్‌ను బహిష్కరించారు..
రెండు ప్రధాన పార్టీలు డబ్బులు పంపిణీ చేస్తే పరస్పరం పట్టించేందుకు సిద్ధం కావడంతో గ్రామంలో డబ్బుల పంపిణీ నిలిచిపోయింది. ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓటర్లు తమకు రెండు పార్టీల నుంచి డబ్బులు అందాకే ఓట్లు వేస్తామంటూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా ఉండటం ఆసక్తికరంగా మారింది.
టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఆ పార్టీ వాళ్లకే పంచారని, బీజేపీ పార్టీని డబ్బులు పంచకుండా ఆపారని, టీఆర్‌ఎస్ మాకు డబ్బులు రాకుండా చేసిందని, మాకు డబ్బులు ఆపినందుకు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని అంతంపేట గ్రామస్తులు ఓటర్లు ఆందోళన చేశారు.
చండూర్ మండలం బంగారిగడ్డలో ఓటర్ల ఆందోళన చేశారు.. డబ్బులు రాలేదని ఓటు వేయకుండా నిరసన తెలిపారు.
రోడ్డు వేస్తేనే.. ఓటేస్తాం: రంగం తండా వాసులు
అదేవిధంగా గట్టుప్పల్ మండలం రంగం తండా వాసులు తమ గ్రామంలో మౌలిక వసతులు లేవంటూ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని స్పష్టమైన హామీ వచ్చే వరకు ఓటింగ్‌కు హాజరు కాబోమంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. మధ్యాహ్నం వరకు తండాలో 321ఓటర్లు ఉండగా వారంతా పోలింగ్‌కు వెళ్ళలేదు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు వారికి హామీ ఇచ్చారని అయినా పోలింగ్‌కు హాజరు కాలేదు. రాతపూర్వక హామీ ఇవ్వాలని ఓటర్లు, కోడ్ కారణంగా అలా హామీ ఇవ్వవలేమని అభ్యర్థులు చెప్పగా అధికారులు, తండా పెద్దలు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
చండూర్ మండలం బంగారిగడ్డలో ఓటర్ల ఆందోళన… డబ్బులు రాలేదని ఓటు వేయకుండా నిరసన pic.twitter.com/Vk4dqpGFHT
— vidhaathanews (@vidhaathanews) November 3, 2022
