విధాత, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్తదోనబండ తండా చెందిన బానోతు బాబు(35) శనివారం పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురై దుర్మరణం చెందాడు. పొలంలో వైర్లు తెగి పోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్ చేసి వైర్లు బిగిస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం జరిగి షాక్‌తో రైతు బాబు మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్ ఆఫ్ ఏబీ స్విచ్ బోర్డులు లేక పోవడంతో ఈ ప్రమాదానికి దారి తీసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు విద్యుత్ శాఖ […]

విధాత, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్తదోనబండ తండా చెందిన బానోతు బాబు(35) శనివారం పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురై దుర్మరణం చెందాడు.

పొలంలో వైర్లు తెగి పోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్ చేసి వైర్లు బిగిస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం జరిగి షాక్‌తో రైతు బాబు మృతి చెందాడు.

ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్ ఆఫ్ ఏబీ స్విచ్ బోర్డులు లేక పోవడంతో ఈ ప్రమాదానికి దారి తీసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated On 26 Nov 2022 12:13 PM GMT
krs

krs

Next Story