మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించిన వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
విధాత: రోజూ 13 పేపర్లు చదివే చిన్న దొరకు రైతు ఆత్మహత్య వార్త కంటికి కనిపించలేదా? అని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. నెల రోజులుగా కామారెడ్డి పట్టణ రైతులు ఆందోళన చేస్తుంటే మున్సిపల్ మంత్రికి ఒక్క పేపర్లో వార్త దొరకలేదా? అని అడిగారు.
ఒక రైతు ప్రాణాలు విడిస్తే తప్ప మీ సర్కారు స్పందించదా? అని మంత్రి కేటీఆర్ ను నిలదీశారు. ఇండస్ట్రియల్ జోన్ కు పచ్చటి భూములే దొరికాయా? అని అడిగారు. . మీ దిక్కుమాలిన నిర్ణయాలతో రైతులను బలి చేస్తారా? అని అన్నారు.
ఇంకెంత మంది చనిపోతే మీ కండ్లు చల్లబడుతయ్ అని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ,రైతులకు న్యాయం చేయాలని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదన్నారు.
మీ దిక్కుమాలిన నిర్ణయాలతో రైతులను బలి చేస్తారా? ఇంకెంత మంది చనిపోతే మీ కండ్లు చల్లబడుతయ్.
ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ,రైతులకు న్యాయం చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు.
2/2@KTRTRS— YS Sharmila (@realyssharmila) January 6, 2023