HomelatestNalgonda | లారీల కొరతను తీర్చాలి: రైతుల డిమాండ్

Nalgonda | లారీల కొరతను తీర్చాలి: రైతుల డిమాండ్

Nalgonda

విధాత: ఐకేపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు లారీల కొరత ప్రధాన అవరోధంగా మారిందని జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై దృష్టి సారించి తగిన లారీలతో ఎగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం పాలడుగు బృందం నల్గొండ మండలంలోని కంచనపల్లి గ్రామంలో ఐకెపి కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు సమస్యలను, రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యంను రైతులు ఐకెపి కేంద్రాలలో పోసి కొనుగోలు కోసం కండ్లు కాయలు కాసేలా చూసే పరిస్థితి దాపురించిందన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వ నట్టు ఐకెపి కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పటికీ తీవ్రమైన లారీల కొరత వలన రోజు కు ఒక లారీ బస్తాలు కూడా తరలించే పరిస్థితి లేదని, లారీల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతు జయలక్ష్మి మాట్లాడుతూ పండించిన పంటను ఐకెపిల్లో నెల రోజులుగా నిల్వ ఉంచామని, తీవ్రమైన వర్షాలకు మొలకెత్తే ప్రమాదం ఉందని, కాంటా పెడుతున్నప్పటికీ లారీల కొరత సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా ధాన్యం సగం కాంటావేసి, సగం వేయకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో తీవ్రంగా లారీలా కొరత ఉందని క్రమ పద్ధతిలో ట్రాక్టర్లు కూడా అనుమతించి ధాన్యాన్ని తరలించాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ పద్మారెడ్డి గడ్డం నవీన్ కట్ట లింగయ్య మద్దిరాల లింగారెడ్డి సూరి కట్టా లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular