Maharashtra | ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పి.. ఆ పసికందు నోట్లో పొగాకు కుక్కి పొట్టన పెట్టుకున్నాడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జల్‌గావ్ జిల్లాలోని హరినగర్ తండాకు చెందిన గోకుల్ గోటిరామ్ జాదవ్(30)కు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన జాదవ్ భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మూడో కాన్పులోనూ […]

Maharashtra |
ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పి.. ఆ పసికందు నోట్లో పొగాకు కుక్కి పొట్టన పెట్టుకున్నాడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జల్‌గావ్ జిల్లాలోని హరినగర్ తండాకు చెందిన గోకుల్ గోటిరామ్ జాదవ్(30)కు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన జాదవ్ భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మూడో కాన్పులోనూ ఆడబిడ్డ జన్మించడంతో జాదవ్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు.
మగ శిశువు జన్మించలేదన్న ఆగ్రహాంతో.. కన్న మమకారాన్ని మరిచిపోయాడు. 8 రోజుల పసికందు నోట్లో పొగాకు కుక్కాడు. చిన్నారికి ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సెప్టెంబర్ 10వ తేదీన చోటు చేసుకోగా, అదే రోజు ఖననం చేశాడు.
వెలుగులోకి ఇలా..
పసిపాపకు జనన ధృవీకరణ పత్రం మంజూరు చేసేందుకు ఆశా వర్కర్.. జాదవ్ నివాసానికి వెళ్లింది. పసిపాప కనిపించకపోయేసరికి జాదవ్‌తో పాటు భార్యను నిలదీయగా, జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఆమె పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. పోలీసుల ఎదుట జాదవ్ నేరాన్ని అంగీకరించాడు. ఖననం చేసిన పసిపాపను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
