విధాత: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా తన మనసులోని బాధను తెలియజేసింది. తను ఈ స్టేజ్‌కి రావడానికి వెనుక ఎంత కష్టం ఉందో గుర్తించకుండా కొందరు ఏవేవో మాటలు మాట్లాడి తనని ధ్వేషిస్తున్నందుకు గుండె బద్దలైనంత బాధగా అనిపిస్తుందని తెలియజేస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ భారీ నోట్‌ను ఆమె రాసుకొచ్చింది. తను మాట్లాడని మాటలను కూడా వక్రీకరిస్తున్నారని, దయచేసి అది మానుకోమని ప్రాధేయపడుతూ.. అందరూ ప్రేమగా ఉండాలని కోరంది. ఆమె చేసిన పోస్ట్‌లో.. […]

విధాత: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా తన మనసులోని బాధను తెలియజేసింది. తను ఈ స్టేజ్‌కి రావడానికి వెనుక ఎంత కష్టం ఉందో గుర్తించకుండా కొందరు ఏవేవో మాటలు మాట్లాడి తనని ధ్వేషిస్తున్నందుకు గుండె బద్దలైనంత బాధగా అనిపిస్తుందని తెలియజేస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ భారీ నోట్‌ను ఆమె రాసుకొచ్చింది. తను మాట్లాడని మాటలను కూడా వక్రీకరిస్తున్నారని, దయచేసి అది మానుకోమని ప్రాధేయపడుతూ.. అందరూ ప్రేమగా ఉండాలని కోరంది. ఆమె చేసిన పోస్ట్‌లో..

‘’గత కొన్ని రోజులుగా కాదు కాదు.. గత కొంతకాలంగా రెండు విషయాలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి నేను సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయాల్సిన పని. నేను నా కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుంచి చాలామంది నన్ను ద్వేషిస్తున్నారు. విమర్శలు చేస్తూ.. ఎప్పుడూ నెగిటివిటీని ప్రచారం చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎంచుకున్న రంగానికి, లైఫ్‌కి ప్రత్యేకత ఉందని నాకు తెలుసు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు.

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ అందరూ ఇష్టపడతారని నేను అనుకోను. నచ్చాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు నచ్చలేదంటే దానర్థం.. మీరు నాపై విమర్శలు చేయవచ్చని కాదు. నా వృత్తిపరంగా.. అందిరినీ సంతోష పెట్టడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నా పని వల్ల మీరు ఆనందపడితే అదే నాకు చాలు. మిమ్మల్ని గర్వించేలా పని చేయడానికి నా శాయాశక్తుల ప్రయత్నిస్తున్నాను. కానీ.. నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేయడం మాత్రం నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది. అవి విన్నప్పుడు గుండె పగిలిపోయినంత బాధగా అనిపిస్తుంది.

ఇంటర్వ్యూలలో నేను మాట్లాడిన కొన్ని మాటలని కొందరు తప్పుగా అర్థం చేసుకుని.. నాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండటం నేను గుర్తించాను. ఇంటర్నెట్‌లో వచ్చే తప్పుడు కథనాల వల్ల పరిశ్రమలో, అలాగే బయట నాకున్న మంచి సంబంధాలపై ప్రభావం పడుతుంది. సద్విమర్శలను నేను స్వాగతిస్తాను. ఎందుకంటే అవి నన్ను నేను మెరుగుపరచుకోడానికి ఉపయోగపడతాయి. కానీ నీచంగా ప్రతికూలత, ద్వేషం ఏంటి?. చాలా కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉండిపోయాను. కానీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ విషయాన్ని ఎత్తి చూపడం ద్వారా.. నేను ఎవరినో ఎత్తి చూపాలని కాదు. నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నాలో ఎటువంటి మార్పు రావాలని కోరుకోవడం లేదు.

ఇంకా చెప్పుకుంటూ పోతే.. మీ అందరూ నాపై చూపిస్తున్న ప్రేమను నేను గుర్తించి, అంగీకరిస్తున్నాను. మీ నిరంతర ప్రేమ, మద్దతు నన్ను ముందుకు నడిపించింది. అదే బయటకు వచ్చి అందరికీ తెలియ జేసే ధైర్యాన్ని నాకు ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై, నేను ఇప్పటివరకు పని చేసిన వ్యక్తులపై, నాకు నచ్చిన వారందరిపై నాకు అభిమానం ఉంది. నేను కష్టపడి పని చేయడంతో పాటు మీకు మంచి జరిగేలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను చెప్పినట్లు.. మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అందరిపై ప్రేమను చూపించండి. మంచిగా ఉండేందుకు అందరూ కృషి చేద్దాం. ధన్యవాదాలు’’ అని రష్మిక మందన్నా పేర్కొంది.

Updated On 10 Nov 2022 4:43 PM GMT
krs

krs

Next Story