- వేధింపులే మృతికి కారణమా?
- ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ
Female constable dies in suspicious condition
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్(Female constable) మౌనిక(Mounika) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ నగరంలోని వేణు రావు కాలనీలో ఇంట్లో ఉరివేసుకొని మౌనిక మృతి చెందింది. కానిస్టేబుల్ మౌనిక మహబూబాబాద్ డిఎస్పీ ఆఫీస్(DSP Office)లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నది. 2014 బ్యాచ్‌కి చెందిన మహిళా కానిస్టేబుల్ మౌనిక అనుమానాస్పద మృతి పై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు ఉద్యోగం చేస్తేనేం ఆమెకు వేధింపులు తప్ప లేదని చర్చ సాగుతోంది.
భర్తే చంపే ఉరి వేసుకున్నట్టు సృష్టించి, ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిత్యం తాను వేధింపులకు గురవుతున్నట్లు తోటి మహిళా కానిస్టేబుళ్లతో తన బాధను పంచుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు మౌనిక భర్త శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీధర్, మౌనిక దంపతులకు ఒక పాప, ఒక బాబు ఉన్నట్లు చెబుతున్నారు.