Saturday, January 28, 2023
More
    Homelatestకామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై.. కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు

    కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై.. కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు

    విధాత, నిజామాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ పై రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్ ను మున్సిపల్ కౌన్సిల్ ఉపసంహ‌రించుకుందని జిపి కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేశారు.

    మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని హై కోర్టు ప్రశ్నించింది. టౌన్ ప్లానింగ్ యాక్టు సెక్షన్ 14 ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జిపిని కోర్ట్ ఆదేశించింది.

    మాస్టర్ ప్లాన్ పై రైతులు న్యాయ పోరాటంతో పాటు దశలవారీ ఆందోళన నిర్వహించారు. పంటలు పండే భూములు ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్ల పరిధిలోకి వెళ్తున్నాయని భావించిన రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. అదే సమయంలో మనోవేదనకు గురైన అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు జనవరి 3న ఆత్మహత్యకు పాల్పడగా రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన మరో రైతు బాలకృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

    5 న కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నాకు ఎమ్మెల్యే రఘునందన్ రావు సంఘీభావం తెలిపారు. 6 న అడ్లూర్ ఎల్లారెడ్డిలో పయ్యావుల రాములు కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అక్కడి నుండి అదే రాత్రి కలెక్టరేట్ ముట్టడికి వేలాది మందితో వెళ్లారు.

    తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ స్పందించి 7న మీడియా ముందుకొచ్చి మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గారు. 15న ప్రధాన రోడ్లపై ముగ్గులు వేసి రైతులు నిరసన తెలిపారు.

    అప్పటికి దిగివచ్చిన మున్సిపల్ కౌన్సిల్ ఈ నెల 20న మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయినప్పటికీ మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుండగా విచారణ సందర్భంగా హై కోర్టు ప్రభుత్వాన్ని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular