Divya Bharati | దివ్య భారతి పరిచయం అక్కర్లేని పేరు. చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేసి.. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. సినిమాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే వరుస హిట్లతో తెలుగు, తమిళం, హిందీలో నటించిన దివ్య భారతి.. 19 ఏళ్ల వయసులోనే అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. దివ్య భారతి జీవిత కథ ఆధారంగా త్వరలో బయోపిక్ తెరకెక్కబోతున్నది. ఇప్పటికే మహానాటి సావిత్రి, సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమాలు […]

Divya Bharati |
దివ్య భారతి పరిచయం అక్కర్లేని పేరు. చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేసి.. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. సినిమాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే వరుస హిట్లతో తెలుగు, తమిళం, హిందీలో నటించిన దివ్య భారతి.. 19 ఏళ్ల వయసులోనే అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది.
దివ్య భారతి జీవిత కథ ఆధారంగా త్వరలో బయోపిక్ తెరకెక్కబోతున్నది. ఇప్పటికే మహానాటి సావిత్రి, సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దివ్య భారతి 1990లో విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘బొబ్బిలి రాజా’ చిత్రంతో మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌లో హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన రౌడీ అల్లుడు, మోహన్‌బాబు సరసన అసెంబ్లీ రౌడీ చిత్రాల్లో అవకాశాలను దక్కించుకున్నది. 992లో ‘విశ్వాత్మ’ చిత్రంలో బాలీవుడ్‌లోకి వెళ్లింది. 1992లో ఏకంగా 11 చిత్రాల్లో నటించింది. నాలుగేళ్ల కెరీర్‌లో దాదాపు 20కిపైగా చిత్రాల్లో నటించింది.
‘షోలా ఔర్ షబ్‌నం’ చిత్రం షూటింగ్ సమయంలో గోవింద ద్వారా దర్శక-నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు మే 10, 1992లో సాజిద్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్న దివ్య భారతి ఏప్రిల్ 1993 సంవత్సరంలో 19 సంవత్సరాల వయసులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇప్పటికీ దివ్య భారతి మృతి మిస్టరీగానే మారింది.
తక్కువ సమయంలోనే వరుస అవకాశాలతో దూసుకుపోయిన దివ్య భారతి ఒక దశలో స్టార్ హీరోయిన్స్‌కు చుక్కలు చూపింది. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. అనుమానాస్పద స్థితిలో చరిత్రలో నిలిచిపోయిన నటి జీవితాన్ని బిగ్‌స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక, నిర్మాతలు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ చిత్రంలో తమన్నా భాటియాను హీరోయిన్‌గా తీసుకోనున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే తమన్నాతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, బయోపిక్‌కు ఓకే చెప్పిందా ? లేదా అనే క్లారిటీ రావాల్సి ఉంది. తమన్నా ఇటీవల వరుస అవకాశాలతో జోరుమీదున్నది. తెలుగులో లస్ట్ స్టోరీస్, భోళా శంకర్, జైలర్ సినిమాల్లో కనిపించింది.
