విధాత: సత్య హరిచంద్రుడి మీదనే తప్పుడు ఆరోపణలు చేసే కాలం ఇది. హరిశ్చంద్రుడే అబద్ధం ఆడితే అనే కథనే.. సీనియర్ వంశీ ఏప్రిల్ ఒకటి విడుదల అని చెప్పి తీశాడు. ఎందుకంటే అలాంటి వారి మీదే ఆరోపణలు పుకార్లు వస్తున్నప్పుడు చెడ్డ వారిపై మరిన్ని ఎక్కువగా రావడం ఆశ్చర్యం కలిగించదు. ఇక విషయానికొస్తే మనందరికీ పరిచయం ఉన్న హీరో నటుడు సీనియర్ నరేష్. ఈయన విజయ నిర్మల మొదటి భర్తకు పుట్టిన వ్యక్తి. సీనియర్ నరేష్‌కు.. విజయ […]

విధాత: సత్య హరిచంద్రుడి మీదనే తప్పుడు ఆరోపణలు చేసే కాలం ఇది. హరిశ్చంద్రుడే అబద్ధం ఆడితే అనే కథనే.. సీనియర్ వంశీ ఏప్రిల్ ఒకటి విడుదల అని చెప్పి తీశాడు. ఎందుకంటే అలాంటి వారి మీదే ఆరోపణలు పుకార్లు వస్తున్నప్పుడు చెడ్డ వారిపై మరిన్ని ఎక్కువగా రావడం ఆశ్చర్యం కలిగించదు. ఇక విషయానికొస్తే మనందరికీ పరిచయం ఉన్న హీరో నటుడు సీనియర్ నరేష్.

ఈయన విజయ నిర్మల మొదటి భర్తకు పుట్టిన వ్యక్తి. సీనియర్ నరేష్‌కు.. విజయ నరేష్‌గా నాడు నామకరణం చేశారు. అనేక చిత్రాలలో హాస్య పాత్రలోనూ పోషించాడు. బాల‌ నటుడిగా 1972 లోనే పండంటి కాపురం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. 1982లో విజయనిర్మల దర్శకత్వం వచ్చిన ప్రేమ సంకెళ్లు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.

నాలుగు స్తంభాలాట, జంబలకడిపంబ, చిత్రం భళారే విచిత్రం ఇలా చాలా చిత్రాల్లో హీరోగా మరెన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఈయన ఇప్పటివరకు నాలుగు వివాహాలు చేసుకున్నాడు. మొదటిసారి సీనియర్ కెమెరామెన్ అయినా శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు జన్మించాడు. అతని పేరు నవీన్ బాబు. ఇతన్ని ఆమధ్య హీరోగా కూడా పరిచయం చేశాడు. తర్వాత మనస్పర్ధలు కారణంగా విడిపోయారు.

రెండో పెళ్లి చేసుకున్నాక అది కూడా విడాకుల వరకు వచ్చింది. 50 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ నేతగా పేరున్న రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం 2010 డిసెంబర్ 3న హిందూపురంలో జరిగింది. ఇక నాలుగో వివాహం ఇంకా జ‌రిగిందో లేదో తెలియదు.. కానీ జరిగినట్లే.

ఇక ఆయన ప్రస్తుతం త‌న స‌హ‌ న‌టి పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నాడని ఇటీవల విపరీతంగా వార్తలు వచ్చాయి. ఆయన ఆమెను పెళ్లి చేసుకున్నాడని కూడా కొన్ని మీడియాలలో వచ్చింది. ఇవన్నీ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ ఆపాలంటూ సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.

మార్ఫింగ్ ఫోటోలు, అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. పలు యూట్యూబ్ ఛానల్‌లకు, వెబ్‌సైట్ల‌కు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. నరేష్ ఈ కేసు విషయంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌, వెబ్‌సైట్స్‌, కొంతమంది వ్యక్తులపై ఆయన పరువు నష్టం దావా వేశాడు.

దీనిపై విచారించి త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు. యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్ దీంతో పాటు ఈ ట్రోల్స్ వెనక తన మూడో భార్య రమ్య కూడా ఉందని ఆయన ఫిర్యాదు చేశాడు. మూడో భార్యతో ఆయన గత మూడు ఏళ్లుగా దూరంగా ఉంటుంటే ..ఇప్పుడు ఆమె మీద కొత్తగా ఈ పరువు నష్టం దావా, తమను ట్రోలింగ్ చేయడం ఏంటి? వాటిపై కోర్టుకెక్కడం చిత్రం భళారే విచిత్రం అనే చెప్పాలి.

Updated On 14 Dec 2022 9:18 AM GMT
krs

krs

Next Story