Wednesday, March 29, 2023
More
    HomelatestSwapnalok Complex | ఉద్యోగం కోసం పోతే.. ఊపిరి పోయింది! స్వప్నలోక్‌ మృతుల్లో ఐదుగురు ఓరుగల్లు...

    Swapnalok Complex | ఉద్యోగం కోసం పోతే.. ఊపిరి పోయింది! స్వప్నలోక్‌ మృతుల్లో ఐదుగురు ఓరుగల్లు బిడ్డలు

    • స్వప్నలోక్‌ మృతుల్లో ఐదుగురు ఓరుగల్లు బిడ్డలు
    • ముగ్గురు నర్సంపేట ప్రాంతం
    • ఇద్దరు మానుకోట ప్రాంతం
    • స్పందించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది
    • ఒక్కక్కరికి రూ.50వేల చొప్పున ఆర్థికసహాయం

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉన్న ఊరిని, కన్నవారిని వదిలిపెట్టి ఉపాధి కోసం, ఉద్యోగం కోసం అనేక కలలతో హైదరాబాదుకు వెళితే ఆ స్వప్న లోకం (Swapnalok Complex ), మూడు పదులు కూడా నిండని ఆరుగురు నవ యవ్వన బిడ్డల ఊపిరి నిలువునా తీసింది. ఎదిగిన బిడ్డలు చేయూతనిస్తారనుకుంటే, అర్ధాంతరంగా కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.

    హైదరాబాదులో జరిగిన అగ్నిప్రమాదం 6 కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. కన్న బిడ్డల మృతితో కుటుంబాలు కన్నీరు మున్నీరవుతుండగా, మృతుల గ్రామాల్లో విషాదం నెలకొంది. స్వప్నలోక్ అగ్ని ప్రమాదం సంఘటనలో ఆరుగురు మృతి చెందితే అందులో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారున్నారు.

    ఇందులో ముగ్గురు వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట (Narsampet) నియోజకవర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు మహబూబాబాద్ జిల్లా మానుకోట (Manukota) నియోజకవర్గానికి చెందిన వారు ఉన్నారు.

    స్వప్నలోక్ మృతుల వివరాలు

    సికింద్రాబాద్ (Secunderabad) ప్యారడైజ్‌ సమీపంలోని నిత్యం రద్దీగా ఉండే స్వప్నలోక్ (Swapnalok Complex )లో ఘోర గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

    మృతులు ఆరుగురిలో ముగ్గురు నర్సంపేట నియోజకవర్గానికి చెందినవారున్నారు. వంగ వెన్నెల (Vanga Vennela), దుగ్గొండి మండలం, మర్రిపల్లి గ్రామం, బానోతు శ్రావణి (Banothu Shravani), ఖానాపూర్ మండలం ఖానాపురం తండా, ఉప్పుల శివ (Salt Shiva), నర్సంపేట మండలం, చంద్రయ్య పల్లి చెందినవారు ఉన్నారు.

    ఇక మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందినవారు కె.ప్రమీల (K. Pramila), గూడూరు మండలం, సురేష్ నగర్, అమరరాజ్ ప్రశాంత్(Amararaja Prashanth), కేసముద్రం మండలం, ఇంటికన్నె గ్రామంగా గుర్తించారు. త్రివేణి (Triveni) ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వారిగా పోలీసులు ప్రకటించారు. వీరంతా దట్టమైన పొగతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులంతా పాతికేళ్ల లోపే వయసున్న ఈ యువతీయువకులు కావడం గమనార్హం. వీరు మార్కెటింగ్, ఈ కామర్స్ ఉద్యోగాలు చేస్తున్నారు.

    స్పందించిన.. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

    హైదరాబాదులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Mla sudharshanreddy) స్పందించారు. మృతుల్లో తన నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఉన్నందున ఆయన బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలు స్వగ్రామానికి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

    హైదరాబాదుకు చెందిన మంత్రులు తలసాని యాదవ్ తదితరులతో మాట్లాడారు. మృతులకు ఒక్కో కుటుంబానికి వ్యక్తిగతంగా రూ. 50 వేల ఆర్థిక సహాయం ప్రకటించి, సంఘటన పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కాగా, అగ్నిప్రమాదం సంఘటన పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Minister Errabelli Dayakar Rao) స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular