విధాత, విజయవాడ: దీపావళి పండుగ వేళ విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. నగరంలోని గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్‌లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో పటాకీ పేలింది. దీంతో షాపులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో మంటలు పక్కనేఉన్న రెండు దుకాణాలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, […]

విధాత, విజయవాడ: దీపావళి పండుగ వేళ విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. నగరంలోని గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్‌లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో పటాకీ పేలింది. దీంతో షాపులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో మంటలు పక్కనేఉన్న రెండు దుకాణాలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు.

మంటలకు బాణా సంచా పేలి పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. దీంతో చుట్టుప్రక్కల నివాసితులు భయంతో ఇళ్లల్లో నుంచి‌ బయటకి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో మూడు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఏ మాత్రం ఆలస్యం అయినా ఇరవై షాపులు దగ్ధం అయ్యేవని, పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated On 23 Oct 2022 7:40 AM GMT
krs

krs

Next Story