One Nation One Election విధాత : జమిలి ఎన్నికల నిర్వాహణ సాధ్యాసాధ్యాల కసరత్తు దిశగా ఈనెల 23న జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ నిర్వహించనున్నట్లుగా కమిటీ చైర్మన్ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. భువనేశ్వర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కమిటీ చైర్మన్‌గా ఆయన జమిలి ఎన్నికల కమిటీకి సంబంధించి తొలిసారి స్పందించారు. ఈ భేటీ తర్వాతా జమిలి ఎన్నికల దిశగా కేంద్రం వైఖరిపై స్పష్టత వచ్చే అవకాశముంది. పార్లమెంటు […]

One Nation One Election
విధాత : జమిలి ఎన్నికల నిర్వాహణ సాధ్యాసాధ్యాల కసరత్తు దిశగా ఈనెల 23న జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ నిర్వహించనున్నట్లుగా కమిటీ చైర్మన్ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. భువనేశ్వర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
కమిటీ చైర్మన్‌గా ఆయన జమిలి ఎన్నికల కమిటీకి సంబంధించి తొలిసారి స్పందించారు. ఈ భేటీ తర్వాతా జమిలి ఎన్నికల దిశగా కేంద్రం వైఖరిపై స్పష్టత వచ్చే అవకాశముంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిసిన మరునాడే రామ్‌నాథ్ కమిటీ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
